ఇక్రిశాట్‌లో చిరుత.. ఎట్టకేలకు చిక్కింది..

ఇక్రిశాట్‌లో చిరుత.. ఎట్టకేలకు చిక్కింది..

సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్‌ పరిశోధన సంస్థ పరిసర ప్రాంతాల్లో భయబ్రాంతులకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. అటవీ శాఖ సిబ్బంది బోను ఏర్పాటు చేసి చాకచాక్యంగా చిరుతను పట్టుకున్నారు. గత ఫిబ్రవరిలో కనిపించిన ఈ చిరుత అప్పటి నుంచి మళ్లీ కనిపించకపోవడంతో అక్కడి వారిలో టెన్షన్‌ పట్టుకుంది. ఆ చిరుత అక్కడే సంచరిస్తుందా? వెళ్లిపోయిందా? అన్న అనుమానాల నేపథ్యంలో ఇటీవలే మళ్లీ కనబడింది. ఈ క్రమంలో నిఘా పెట్టి బోనును ఏర్పాటు చేయడంతో అందులో చిక్కింది. ఆ చిరుతను అటవీశాఖ సిబ్బంది అక్కడి నుంచి తరలించారు.