జడ్పీ చైర్మన్ల ఎంపిక నేడే.. అన్నీ టీఆర్ఎస్ వశం..!

జడ్పీ చైర్మన్ల ఎంపిక నేడే.. అన్నీ టీఆర్ఎస్ వశం..!

ఇప్పటికే మెజార్టీ మండల పరిషత్‌లను కైవసం చేసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు జడ్పీ పీఠాలపై గురి పెట్టింది. రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్‌ పాలకమండళ్ల ఎన్నిక ఇవాళ జరగనుంది. అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ సభ్యుల ఎన్నికల లాంఛనమే కానుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు మొదలయ్యే ప్రత్యేక సమావేశంలో తొలుత ఇద్దరు కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకుంటారు. తదుపరి జడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక జరిగితేనే తదుపరి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నిక నిర్వహిస్తారు. అన్ని జడ్పీల్లోనూ టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మెజారిటీ లభించిన నేపథ్యంలో అన్ని పాలక మండళ్ల ఎన్నిక లాంఛనమే కానుంది. 32 జడ్పీల పరిధిలో 538 మంది జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. కనిష్ఠంగా మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో ఐదుగురే ఉండగా, గరిష్ఠంగా నల్లగొండ జిల్లాలో 31మంది ఉన్నారు. పార్టీలవారీగా చూస్తే టీఆర్‌ఎస్‌ 449, కాంగ్రెస్‌ 75, బీజేపీ 8, ఇతర పార్టీలు, స్వతంత్రులు ఆరుగురు ఉన్నారు.