అగ్రగామిగా నిలిస్తే రూ.10 కోట్లు: కేసీఆర్‌

అగ్రగామిగా నిలిస్తే రూ.10 కోట్లు: కేసీఆర్‌

ఇంత ఏకపక్షంగా 32 జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ రాలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లతో ప్రగతిభవన్ లో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ వికాసానికి కృషి చేయడంలో అగ్రగామిగా నిలిచిన జిల్లా పరిషత్‌లకు సీఎం ప్రత్యేక ప్రగతి నిధి నుంచి రూ.10 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు.