మళ్లీ సోషల్ మీడియాలో బ్యాలెట్ పత్రాలు..

మళ్లీ సోషల్ మీడియాలో బ్యాలెట్ పత్రాలు..

ఓటు వేసే సమయంలో ఫొటోలు తీయకూడదు.. ఇక అలాంటి ఫొటోలు ఎక్కడైనా పోస్ట్ చేస్తే జైలు శిక్షే.. ఇలాంటి కఠిన నిబంధనలు ఉన్నా ఆకతాయీలు మాత్రం ఆగడంలేదు. తాజాగా, హబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్‌ ఎంపీటీసీ స్థానం పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలకు చెందిన రెండు బ్యాలెట్‌ పత్రాలకు సంబంధించిన(జెడ్పీటీసీ, ఎంపీటీసీ) ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి ఉన్న ఈ రెండు బ్యాలెట్ పత్రాలు. శుక్రవారం జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు వేసిన బ్యాలెట్‌ పత్రాలే. ఆ బ్యాలెట్ పత్రాలను మొబైల్‌లో ఫొటో తీసి పోస్టు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు, క్రమ సంఖ్య ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.