ఐఫోన్ వాడొద్దు...ఫేస్ బుక్ ఉద్యోగులకు ఆదేశాలు

ఐఫోన్ వాడొద్దు...ఫేస్ బుక్ ఉద్యోగులకు ఆదేశాలు

ఇకనుంచి ఫేస్ బుక్ ఎంప్లాయీస్ ఆపిల్ ఫోన్ వాడరాదంటూ కచ్చితమైన ఆంక్షలు విధించారు.. ఆ కంపెనీ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్. ప్రపంచవ్యాప్తంగా కస్టమర్ల అభిమానం చూరగొన్న ఆపిల్ ఫోన్ మీదనే ఇలాంటి నిబంధనలు ఎందుకు విధించాడన్నది ఆసక్తికరమైన అంశం. దీనికి నేపథ్యం ఏమిటంటే..

ఆపిల్ సీఈఓ టిమ్ కుక్.. ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో ఫేస్ బుక్ సీఈఓ చిన్నబుచ్చుకున్నాడు. దీంతో తన కంపెనీలో ఇకపై ఎవ్వరు కూడా ఆపిల్ ఫోన్స్ వాడరాదని, వాటికి బదులుగా ఆండ్రాయిడ్ ఫోనే వాడాలని స్వయంగా ఆదేశించారు. ఆ ఇంటర్వ్యూలో టిమ్ కుక్.. తాము వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడమని, ప్రైవసీని మానవహక్కుగా పరిగణిస్తామని, అది పౌర స్వేచ్ఛ అంటూ వ్యాఖ్యానించారు. అంతవరకు బాగానే ఉన్నా... ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి.. మార్క్ జుకర్ బర్గ్ స్థానంలో మీరే ఉంటే ఏం చేస్తారని ప్రశ్నించడంతో ఈ పరిణామానికి దారి తీసింది. ఆ ప్రశ్నకు టిమ్ కుక్... ఈ స్థానంలో (సీఈఓ) ఉండేవాడిని కాదు అన్నారు. ఇది పరోక్షంగా ఫేస్ బుక్ సీఈఓ జుకర్ బర్గ్ కు తాకింది. దీంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఫేస్ బుక్ యూజర్ల ఖాతాలను కేంబ్రిడ్జ్ ఎనలటికా అనే విశ్లేషణ సంస్థకు ఇచ్చినట్లు తేలడంతో అది సంచలనాత్మకంగా మారింది.