ప్రగతి నివేదన సభ

ప్రగతి నివేదన సభ ప్రత్యక్ష ప్రసారం

సీఎం కేసీఆర్ ప్రసంగం

 • మోసం చేసే మాటలు చెప్పము
 •  మమ్మల్ని మళ్ళీ ఆశీర్వదించండి 
 • ఢిల్లీకి గులామ్ లుగా మారోద్దు 
 • తమిళనాడు వాళ్ళ మాదిరిగా సొంతపాలన ఉండాలి 
 •  ఢిల్లీకి గులాం చేసే గులాం గా ఉందామా... గులాబీ నీడన ఉందమా..? 
 •  ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ఉంటాయి 
 • ఇది కేసీఆర్ ఉన్నడు కాబట్టే అయ్యింది
 • మొన్ననే ఆమోదం వచ్చింది.
 • మన ఉద్యోగాలు మనకే 
 • మోడీ కొంత ఊగిసలాడినా..మెప్పించినా
 • చేస్తావా చస్తవ చెప్పు మోడీ అని జోన్ల గురించి కూసున్న 
 • త్వరలోనే మేనిఫెస్టో కమిటీ వేసి మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది చెప్తం 
 • సమయం వచ్చినప్పుడు అక్కరకు వచ్చే నిర్ణయం తీసుకుంటాం 
 • తెలంగాణ భవిష్యత్తుకు ఏదీ మంచిదైతే ఆ నిర్ణయం తీసుకోండి..
 • అని మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పారు 
 • నిరుద్యోగ భృతి గురించి కూడా ఆలోచిస్తా 
 • ఇప్పుడు ఇచ్చే పెన్షన్ పెంచుతాం 
 • భవిష్యత్ అద్భుతమైన తెలంగాణ కావాలి 
 • ఫేస్ బుక్, వాట్స్ అప్ లో..మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు 
 • తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ఏదీ మంచిదైతే అదే నా నిర్ణయం
 • కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి
 • కోటి ఎకరాలకు నీళ్లిచ్చి ఆకు పచ్చ తెలంగాణ చూపిస్తాను
 • మరో 1300 గ్రామాలకు త్వరలో నీళ్లిస్తాం
 • రైతులు అప్పులపాలు కావొద్దని రైతు బంధు పథకం
 • చనిపోయిన రైతు కుటుంబం రోడ్డున పడొద్దని బీమా పథకం
 • 2018-19లో ఆర్థిక ప్రగతి 17.83గా ఉంది
 • అన్ని వర్గాల ప్రజలు బాగుంటేనే నిజమైన వికాసం
 • కేజీ టూ పీజీలో భాగంగానే గురుకులాలు ఏర్పాటు చేశాం
 • గురుకులాలు, కాలేజీల్లో మీ పిల్లలే చదువుతున్నారు
 • పంచాయతీ ఎన్నికల తరువాత 3వేల మంది గిరిజనులు సర్పంచులు 
 • దేశంలో ఎక్కడాలేని విధంగా పెన్షన్లు అందిస్తున్నాం
 • కోటి ఎకరాలకు నీళ్లీచ్చే పనులు శరవేగంగా సాగుతున్నాయి
 • వచ్చే ఎన్నికల వరకు మిషన్ భగీరథ పూర్తి చేస్తాం
 • ఆ తరువాతే ఎన్నికల్లో ఓట్లు అడుతాం
 • ఐదున్నర వేల కోట్లు రైతుబంధు ద్వారా రైతన్నలకు ఇచ్చాం
 • నవంబర్ నెలలో రెండో పంట డబ్బులు ఇస్తాం
 • టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం రైతుబంధు పథకం ఆగదు
 • తెలంగాణ ఉద్యమంలో ప్రజలే పాత్రదారులు
 • చేనేత కుటుంబాల్లో సంతోషాన్ని నింపాం
 • గొర్రె పిల్లల పంపకంతో గొల్లకుర్మల జీవితాలు బాగుపడ్డాయి
 • చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు జోలి పట్టాను
 • గీత కార్మికుల కోసం సంక్షేమ పథకాలు తెచ్చాం
 • కులవృత్తులు ఎంత ధ్వంసమయ్యాయో తలచుకుంటే భాదేసింది
 • ఒంటరిగా ఎన్నికల్లో నిలబడితే దీవించి పంపించారు
 • ఇకపై రెప్పపాటు కరెంట్ పోదు
 • కమ్యూనిస్టు పార్టీ నాయకుడిని ఒప్పించడానికి 38 సార్లు తిరిగాను
 • 14ఏళ్ల కఠోర శ్రమ తరువాత దక్కిన తెలంగాణ రాష్ట్రం
 • ప్రజల దీవెనలతో జలదృశ్యంలో పార్టీ ఆవిష్కరణ
 • 10 నెలల పాటు విపరీతమైన మేథోమథన పరిస్థితి
 • అనాటి ప్రభుత్వం అధికార మదంతో కళ్లు మూసుకుంది
 • ఉప ఎన్నికలు, రాజీనామాలతో ఉప్పెన సృష్టించాం
 • ఢిల్లీ పెద్దలు అహంకారంతో ఏమీ చేస్తారులే అని ప్రవర్తించారు
 • ఎక్కని కొండ లేదు మొక్కని బండ లేదు
 • ప్రపంచమే నివ్వరపోయే విధంగా జనం తరలివచ్చారు
 • ప్రతి ఒక్కరి వందనం అభివందనం
 • తెలంగాణ అంటే వలస పాలకులకు ప్రయోగశాలగా మారింది
 • కరెంట్ చార్జ్ పెంచడం, నేను రాసిన లేఖతో ఉద్యమానికి బీజం పడింది

 

కడియం కామెంట్స్

 • దేశ ప్రజల దృష్టిని ఆకర్షించే స్ధాయికి ఎదిగాం
 • నూతనంగా ఏర్పడిన రాష్ట్నాన్ని ఈ స్ధాయికి కేసీఆర్ తీసుకువచ్చారు
 • వివిధ సంక్షేమ పథకాలను అమలుచేసి ముందుకు వెళ్తున్నాం

కేశవరావు కామెంట్స్

 • ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు 
 • ప్రభుత్వ అభివృద్ధిని నివేదించేందుకే ఈ సభ

 

 • సభావేదికపై ఆశీనులైన సీఎం కేసీఆర్
 • ప్రగతి నివేదన సభ ప్రాంగణానికి చేరుకున్నసీఎం కేసీఆర్
 • హెలికాప్టర్ లో కొంగరకలాన్ బయలుదేరిన సీఎం కేసీఆర్
 • నిఘా నీడలో కొంగరకలాన్ ప్రగతి నివేదన సభ
 • సీసీ కెమెరాలను డీజీపీ ఆఫీస్ లోని కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం
 • డీజీపీతో కలిసి పర్యవేక్షిస్తున్న వందమంది పోలీసు సిబ్బంది
 • సంబంధిత అధికారులకు డీజీపీ తగిన విధంగా ఆదేశాలు జారీ
 • ట్రాఫిక్ స్తంభించకుండా డీజీపీ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు
 • ప్రగతి భవన్ నుంచి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బయలుదేరిన సీఎం కేసీఆర్


కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా పర్యవేక్షిస్తున్న డీజీపీ

ఓఆర్ఆర్ పై ట్రాఫిక్ లో చిక్కుకున్న 10వేల వాహనాలు

జనసంద్రమైన కొంగరకలాన్

సభావేదికపై కేటీఆర్ తో ఎంపీ కవిత సెల్ఫీ

 • బారులు తీరిన విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చే వాహనాలు 
 • పెద్ద అంబర్‌పేట వద్ద ఔటర్‌రింగ్‌రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ 
 • నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం జిల్లాల వైపు నుంచి వస్తున్న వాహనాలు
 • పటాన్‌చెరు, అప్పా రింగ్‌రోడ్డు నుంచి కొంగరకలాన్‌ వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ జామ్
 • బస్సులు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా సభాస్థలికి వస్తున్న కార్యకర్తలు
 • 31 జిల్లాల నుంచి భారీగా వస్తున్నపార్టీ శ్రేణులు, అభిమానులు 

ఔటర్ రింగ్ రోడ్డుపై స్తంభించిన ట్రాఫిక్

 • కొలంగరకాలన్ లో గులాబీ దండు ధూంధాం
 • ప్రత్యేక హెలికాప్టర్ ద్వార సభా ప్రాంగణానికి చేరుకున్న మంత్రులు
 • తన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తున్న డీజీపీ
 • ట్రాఫిక్ సమస్యలు ఉన్న చోట అధికారులను అప్రమత్తం చేస్తున్న పోలీసులు
 • సభ పూర్తయిన తరువాత సూచించిన రూట్లలోనే వెళ్లాలంటున్న అధికారులు

టీఆర్‌ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో అభివృద్ధిపై ఆటలు, పాటలు

ఆట పాటలతో సభికుల్లో ఉత్సాహం నింపుతున్న కళాకారులు

కళాకారులతో కలిసి హుషారుగా డోలు వాయించిన మంత్రి కేటీఆర్

 • బీబీనగర్ లో భారీగా ట్రాఫిక్ జామ్, వేలాదిగా నిలిచిపోయిన వాహనాలు
 • యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో ట్రాఫిక్ జామ్, నాలుగు కిలో మీటర్ల మేర నిలిచిన వాహనాలు 

వినూత్నంగా చాటుకున్న 'అభిమానం'

 • సభా ప్రాంగణంలో ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు
 • సీఎం కేసీఆర్ కోసం సిద్ధంగా ఉన్న మరో హెలికాప్టర్
 • రెండు హెలికాపర్టర్లలో బయలుదేరిన మంత్రులు
 • బేగంపేట్ ఎయిర్ పోర్టులో సిద్ధంగా ఉన్న మూడు హెలికాప్టర్లు
 • ప్రగతి భవన్ నుంచి సభాప్రాంగణానికి బయలుదేరిన మంత్రులు 
 • ఔటర్ రింగ్ రోడ్డుపైకి చేరుకుంటున్న వందలాది వాహనాలు
 • మేడ్చల్ హైవే పై భారీగా నిలిచిపోయిన వాహనాలు

నిజామాబాద్ జిల్లా నుంచి తరలివస్తున్న రైతులు, కార్యకర్తలు, యువకులు

పావు గంటలో కేటీఆర్ కు షర్ట్ కుట్టిన మేరు సంఘం నాయకులు

జనజాతరను తలపిస్తున్న ప్రగతి నివేదన సభ ప్రాంగణం
 

సభకు చేరుకున్న కళాకారుల ఆటపాట

ప్రాంగణంలో చిందులు వేస్తున్న కళాకారులు

జనసంద్రమైన ఔటర్ రింగ్ రోడ్

శ్రీరాముడి అవతారంలో కేసీఆర్

సభ వేదిక వివరాలు..

 • 600 మంది కూర్చునేలా ఏర్పాటు 
 • సభా ప్రాంగణంలో 300 సీసీ కెమెరాలు 
 • కిలోమీటర్ దూరం నుంచైనా సభా వేదిక కనిపించేలా ఏర్పాటు
 • సభా వేదిక ముందు 16 గ్యాలరీలు ఉంటాయి
 • సభ చుట్టూ 50 భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు

పటాన్‌చెరు నుంచి ఒగ్గు డోలు, బోనాలు, పీర్లు ఊరేగింపుగా సభ కి తరలి వెళ్తున్న వేలాది కార్యకర్తలు

మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్ వచ్చే బెంగుళూర్ హైవే పై డ్రోన్ కెమెరాలతో వాహన రద్దీని పరిశీలిస్తున్న పోలీసులు

మంత్రి తలసాని..

 • దేశ రాజకీయాల్లో నేటి సభ చరిత్ర సృష్టిస్తుంది
 • ఏ ప్రాంతీయ పార్టీలు, ఏ జాతీయ పార్టీలు కూడా ఈ స్థాయి సభను నిర్వహించలేవు
 • ఎన్నికలకు 6 నెలల ముందు ప్రభుత్వ విజయాలను చాటేందుకే ఈ సభ
 • ఎన్నికల శంఖారావంగానే ప్రగతి నివేదిక సభ
 • చేతకాని ప్రతిపక్షాలు సభ మీద పడి ఏడుస్తున్నాయి

సిటీ లైట్ హోటల్ నుంచి 1000 బుల్లెట్ల బైక్ ర్యాలీని ప్రారంభించిన మంత్రి తలసాని

సభ వేదిక వద్దకు చేరుకున్న కేటీఆర్‌.. ధూం..ధాం కళాకారులతో సెల్ఫీలు దిగుతున్న కేటీఆర్‌..

సభ ప్రాంగణం వద్ద కమ్ముకున్న మబ్బులు

 • సభా ప్రాంగణానికి మొత్తం 1.2 లక్షల లీటర్ల తాగు నీరు సరఫరా
 • మొత్తం 24 ట్యాంకర్లతో 8 ట్రిప్పుల్లో తరలింపు 
 • అంబర్‌ పేట్‌ నుంచికార్లు, బైక్‌ ర్యాలీతో బయలుదేరిన 30వేల మంది
 • హుస్నాబాద్ నుంచి 150 ట్రాక్టర్లు, 240 బస్సులు, 100 వాహనాలలో వస్తున్న కార్యకర్తలు
 • చొప్పదండి నుంచి 200 ప్రభుత్వ వాహనాలు, 500 ఇతర వాహనాలపై 15000 మంది రాక.. 
 • ధర్మపురి నియోజకవర్గంలో నుంచి 115 బస్సులు, 400 కార్లు, స్కూల్‌ బస్సులు, 90 ట్రాక్టర్లతో బయలుదేరిన కార్యకర్తలు,