కురపాం - కురపాం

కురపాం
కురపాం

2014 సాధారణ ఎన్నికలో కురుపాం నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్ధి పాముల పుష్పవాణి విజయం సాధించారు. 19083 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ తిరుగుబాటు అభ్యర్దిగా పోటీ చేసి 26044 ఓట్లు తెచ్చుకుని మూడోస్థానానికే పరిమితమయ్యారు. సిపిఎం మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మణమూర్తి 5689 ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయారు. ఇక కాంగ్రెస్ అభ్యర్ది ఇంద్రసేన్ వర్ధన్ కేవలం 2594 ఓట్లు పొంది డిపాజిట్ కోల్పోయారు. మాజీ మంత్రి శత్రుచర్ల సోదరుడు చంద్రశేఖరరాజు కూడా ఇక్కడ ఒకసారి గెలిచారు. విజయరామరాజు రెండుసార్లు కాంగ్రెస్ తరపున , ఒకసారి టిడిపి తరపున లోక్ సభకు కూడా ఎన్నికయ్యారు.  కాంగ్రెస్ మిత్రపక్షంగా 2004లో సిపిఎం ఇక్కడ ఒకసారి గెలిచింది. 2009లో కురుపాంలో టిడిపి మిత్రపక్షంగా పోటీ చేసినా నెగ్గలేకపోయింది. 

Activities are not Found
No results found.
By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close
Telegram Connect With Telegram