పాడేరు - పాడేరు

పాడేరు
పాడేరు

2014 సాధారణ ఎన్నికలలో పాడేరు రిజర్వుడ్ నియోజకవర్గంలో వైసిపి 26141 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందింది. ఆ పార్టీ అభ్యర్ధి గిడ్డి ఈశ్వరి తన సమీప సిపిఐ ప్రత్యర్ధి జి.దేముడుపై గెలిచారు. మాజీ ఎమ్మెల్యే అయిన దేముడు రెండో స్థానంలో నిలిచారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.బాలరాజు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి 21086 ఓట్లు తెచ్చుకున్నారు. డిపాజిట్ దక్కించుకున్న అతికొద్దిమంది కాంగ్రెస్ అభ్యర్ధులలో ఈయన ఒకరు. బిజెపి-టిడిపి కూటమి నుంచి పోటీ చేసిన ఎల్.గాంధీకి 17029 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. బాలరాజు గతంలో చింతపల్లి(రద్దైంది) నుంచి ఒకసారి, పాడేరు నుంచి మరోసారి గెలిచారు. ఆయన వైఎస్ , రోశయ్య,కిరణ్ క్యాబినెట్ లలో మంత్రిగా పని చేశారు. సిపిఐ నేత దేముడు ఒకసారి చింతపల్లి నుంచి ఎన్నికయ్యారు. 
పాడేరులో కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఐదుసార్లు, టిడిపి మూడుసార్లు వైసిపి, బిఎస్పీ, జనతాపార్టీలు ఒక్కోసారి గెలిచాయి.1989లో ఇక్కడ గెలిచిన ఎం.బాలరాజు నేదురుమల్లి, కోట్ల క్యాబినెట్ లలో మంత్రిగా ఉన్నారు. 1999లో గెలిచిన మణికుమారి కూడా చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. ఇక్కడ బిఎస్పీ అభ్యర్ధి ఎల్.రాజారావు 2004లో గెలిచి ఆ పార్టీ తరపున గెల్చిన ఏకైక నేతగా గుర్తింపు పొందారు.  1967లో ముందు గొలుగొండ నియోజకవర్గం ఉండేది. అక్కడ 1952లో ద్విసభ్య నియోజకవర్గంలో ఎల్.కె.వి. పడాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  ఆర్. లచ్చాపాత్రుడు గొలుగొండలో ఒకసారి, నర్సీపట్నంలో మరోసారి గెలిచారు. 

Activities are not Found
No results found.
By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close
Telegram Connect With Telegram