పార్వతీపురం - పార్వతీపురం

పార్వతీపురం
పార్వతీపురం

2014 సాధారణ ఎన్నికలలో పార్వతీపురంలో టిడిపి అభ్యర్ధి బొబ్బిలి చిరంజీవులు తన సమీప వైసిపి ప్రత్యర్ధి జె.ప్రసన్నకుమార్ పై 6129 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2009లో ఓడిపోయిన చిరంజీవులు , 2014 ఎన్నికల్లో గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జయమణి 2014లో పోటీ చేయలేదు. కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన ఎ.జోగారావు 6911 ఓట్లను పొంది డిపాజిట్ కోల్పోయారు. 2004లో ఇక్కడ నుంచి గెలుపొందిన అప్పటి మంత్రి శత్రుచర్ల విజయరామరాజు 2009లో ఈ నియోజకవర్గం రిజర్వుడ్ కేటగిరిలోకి వెళ్లడంతో ఆయన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 
పార్వతీపురం నియోజకవర్గానికి మొత్తం 16సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఆరుసార్లు గెలిచాయి. టిడిపి ఆరుసార్లు, స్వతంత్ర, జనతాపార్టీలు ఒక్కొక్కసారి నెగ్గగా.. ఇండిపెండెంట్లు రెండుసార్లు విజయం సాధించారు. వైరిచర్ల చంద్రచూడామణి, ఎం.వెంకట్రామానాయుడులు మూడేసి సార్లు గెలిచారు. చీకటి పరశురామానాముడు, ఎర్రా కృష్ఱామూర్తి రెండేసి సార్లు గెలుపొందారు. ఎర్రా కృష్ణమూర్తి మరణం కారణంగా ఆయన భార్య అన్నపూర్ణమ్మ గెలిచారు. ఇక్కడ నుంచి గెలిచిన వారిలో శత్రుచర్లకి 2004 నుంచి డాక్టర్ రాజశేఖర్ మంత్రివర్గంలో సభులైనారు.  వైఎస్ తర్వాత రోశయ్య, కిరణ్ మంత్రి వర్గాలలో పని చేశారు. చీకటి పరుశురాముడు కొంతకాలం అంజయ్య క్యాబినెట్ లో సభ్యునిగా ఉన్నారు.

Activities are not Found
No results found.
By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close
Telegram Connect With Telegram