రంపచోడవరం - రంపచోడవరం

రంపచోడవరం
రంపచోడవరం

2014 సాధారణ ఎన్నికలలో గిరిజనులకు రిజర్వుడ్ అయిన రంపచోడవరం నియోజకవర్గంలో వైసిపి అభ్యర్ధి వి.రాజేశ్వరి గెలుపొందారు. ముందుగా ఒక నేత ఈ పార్టీ తరపున నామినేషన్ వేయగా, ఈమె డమ్మి అభ్యర్ధిగా వేశారు. కానీ ఆయన గిరిజనుడు కాదని నామినేషన్ తోసి పుచ్చడంతో రాజేశ్వరి అభ్యర్ధి అయి విజయం సాధించారు. రాజేశ్వరీ తన సమీప టిడిపి అభ్యర్ధి , మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావును 8222 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కెవివి.సత్యనారాయణ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి కేవలం 3816 ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయారు. గతంలో ఎల్లవరంగా ఉన్న నియోజకవర్గం రంపచోడవరంగా మారింది. ఎల్లవరం మాదిరే ఇది కూడా గిరిజనులకు రిజర్వు అయ్యింది. 1983లో తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 2009లో తొలిసారి ఇక్కడ టిడిపి ఓడిపోయి, కాంగ్రెస్ అభ్యర్ధి కెవివి.సత్యనారాయణరెడ్డి గెలుపొందారు.2009లో సిట్టింగ్ ఎమ్మెల్యే చిన్నం బాబూ రమేష్ టిడిపి తరపున , టిడిపిని వదలి ప్రజారాజ్యంలో చేరిన మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వెంకటేశ్వరరావు తిరిగి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసినా ఈసారి వైసిపి చేతిలో ఓడిపోయారు. 
ఎల్లవరం, రంపచోడవరం నియోజకవర్గాలకు కలిపి 12సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐలు ఐదుసార్లు గెలిస్తే, ఆరుసార్లు టిడిపి గెలిచింది. ఒకసారి వైసిపి గెలిచింది. సీతంశెట్టి వెంకటేశ్వరరావు ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిచారు. చోడిమల్లిఖార్జున, చిన్నం జోగారావులు రెండేసిసార్లు గెలిచారు. 2004లో టిడిపి తరపున గెలిచిన రమేష్, మాజీ ఎమ్మెల్యే చిన్నం జోగారావు కుమారుడు ఇక్కడ 1978లో గెలిచిన గొర్రెల ప్రకాశరావు  అంజయ్య మంత్రివర్గంలో ఉన్నారు. 

Activities are not Found
No results found.
By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close
Telegram Connect With Telegram