గన్నవరం - గన్నవరం

గన్నవరం
గన్నవరం

2014 సాధారణ ఎన్నికలలో గన్నవరం రిజర్వుడ్ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్ధి పి.నారాయణమూర్తి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు.  నారాయణ మూర్తి తన సమీప  వైసిపి అభ్యర్ధి కె.చిట్టిబాబుపై 13505 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీ దేవికి కేవలం 991 ఓట్లు తెచ్చుకోవడంతో డిపాజిట్ గల్లంతైంది. 
2004లో రాజేశ్వరీదేవి నగరం రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.  ఆ నియోజకవర్గం రద్దు అయ్యి గన్నవరం నియోజకవర్గంగా ఏర్పడింది. 2009లో అక్కడ నుంచి పోటీ చేసి గెలిచి, 2014లో ఓటమి పాలయ్యారు. నగరం నియోజకవర్గంలో రెండుసార్లు గెలిచిన గడ్డం మహాలక్ష్మీ రాజోలులో ఒకసారి నెగ్గారు. టిడిపి నేతఉండ్రు కృష్ణారావు మూడుసార్లు, కాంగ్రెస్ నేత నితిపూడి గణపతిరావు రెండుసార్లు నెగ్గారు. ఎన్ గణేశ్వరరావు ఒకసారి నగరంలో, మరోసారి రాజోలులో విజయం సాధించారు. 

Activities are not Found
No results found.