కొత్తపేట - కొత్తపేట

కొత్తపేట
కొత్తపేట

2014 సాధారణ ఎన్నికలలో కొత్తపేట నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్ధి చిర్ల జగ్గారెడ్డి విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావును ఓడించారు జగ్గారెడ్డి.  జగ్గారెడ్డికి 713 ఓట్ల ఆధిక్యత వచ్చింది. 2009లో ప్రజారాజ్యం తరపున గెలిచి, ఆ పార్టీని కాంగ్రెస్ లో వీలినం చేయడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యారు సత్యానందరావు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపధ్యంలో సత్యానందరావు 2014 ఎన్నికలకు ముందు టిడిపిలోకి వచ్చి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ తరపున ఇక్కడ పోటీ చేసిన ఆకుల రామకృష్ణకు 2144 ఓట్లు వస్తే, జై సమైకాంధ్ర పార్టీ తరపున పోటీ చేసిన కెవి.సత్యనారాయణరెడ్డికి 7014 ఓట్లు రావడం విశేషం. 
కొత్తపేట నుంచి సత్యానందరావు మూడుసార్లు గెలవగా, జగ్గారెడ్డి రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జగ్గారెడ్డి 2004లో కాంగ్రెస్ తరపున గెలిచారు. 2014 ఎన్నికల ముందుకు వైసిపిలో చేరి గెలుపొందారు. 
కొత్తపేటకు 14సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఏడుసార్లు, టిడిపి నాలుగుసార్లు, జనతాపార్టీ, ప్రజారాజ్యం పార్టీ, వైసిపి ఒకసారి గెలుపొందాయి. సత్యానందరావు 1994,99లలో టిడిపి అభ్యర్ధిగా, 2009లో ప్రజారాజ్యం తరపున గెలుపొందారు. జగ్గారెడ్డి తండ్రి సోమసుందరరెడ్డి కూడా కొత్తపేటలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రముఖ స్వాతంత్రయోధుడు కళా వెంకట్రావు కొత్తపేటలో ఒకసారి ఎన్నికయ్యారు. ఎంవిఎస్.సుబ్బరాజు నాలుగుసార్లు గెలుపొందారు. సుబ్బరాజు కొంతకాలం జనతాపార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. కళా వెంకటరావు అప్పట్లో బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి మంత్రివర్గాలలో సభ్యునిగా ఉన్నారు. 1952కి ముందు కూడా సంయుక్త మద్రాసు రాష్ట్రంలో కూడా కళా మంత్రిగా పని చేశారు. 

Activities are not Found
No results found.