మండపేట - మండపేట

మండపేట
మండపేట

2014 సాధారణ ఎన్నికలలో మండపేట నియోజకవర్గం నుంచి టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మరోసారి భారీ మెజార్టీతో గెలుపొందారు. జోగేశ్వరరావు తన సమీప వైసిపి అభ్యర్ధి గిరిజాల వెంకటస్వామి నాయుడును 36014 ఓట్ల ఆధిక్యతతో ఓడించారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కె.ప్రభాకరరావుకు కేవలం 1850 ఓట్లు వచ్చి డిపాజిట్ కోల్పోయారు. జోగేశ్వరరావు వరుసగా రెండోసారి గెలిచారు. వెంకటస్వామి నాయుడు గతంలో ఒకసారి రద్దైన కడియం నియోజకవర్గం నుంచి టిడిపి తరపున శాసనసభకు , మరోసారి రాజమండ్రి నుంచి బిజెపి తరపున లోక్ సభకు ఎన్నికయ్యారు. అలమూరులో ప్రముఖ నేత సంగీత వెంకటరెడ్డి రెండుసార్లు గెలిస్తే, అంతకుముందు ఉన్న పామర్రు నియోజకవర్గంలో మరోసారి గెలిచారు. సంగీత వెంకటరెడ్డి కపిలేశ్వరపురం జమీందారు ఎస్బిపి పట్టాభి రామారావును ఒకసారి, ఆయన సోదరుడు సత్యనారాయణరావును మరోసారి ఓడించారు. పామర్రులో ఎస్బీపి పట్టాభిరామారావు మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికైతే, మూడుసార్లు లోక్ సభకు కూడా రాజమండ్రి నుంచి గెలుపొందారు.  ఈయన శాసనమండలి సభ్యునిగా కూడా వ్యవహరించారు. ఆయన రాష్ట్రం, కేంద్రంలోను మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పట్టాభిరామారావు సోదరుడు సత్యనారాయణరావు 1999లో రాజమండ్రి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. వాజ్ పేయి మంత్రివర్గంలో ఈయన సభ్యునిగా ఉన్నారు. 
మండపేట, అలమూరులలో కలిపి తెలుగుదేశం పార్టీ ఐదుసార్లు, కాంగ్రెస్ మూడుసార్లు గెలిచాయి. 

Activities are not Found
No results found.