రాజోలు - రాజోలు

రాజోలు
రాజోలు

2014 సాధారణ ఎన్నికలలో రాజోలు నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్ధి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గెలుపొందారు. సూర్యారావు తన సమీప ప్రత్యర్ధి బి.రాజేశ్వరరావును 4683 ఓట్ల మెజార్టీతో ఓడించారు.  1985లో ఎన్టీఆర్ క్యాబినెట్ ,  ఆ తర్వాత కాంగ్రెస్ లోకి ప్రవేశించి 2004లో కాంగ్రెస్ తరపున గెల్చి వైఎస్ క్యాబినెట్ లో  మంత్రిగా పని చేశారు. కానీ చివరి రోజులలో పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.  ఆ తర్వాత టిడిపిలోకి వచ్చారు గొల్లపల్లి. సూర్యారావు గతంలో అల్లవరం నుంచి ప్రాతినిధ్యం వహించారు. కానీ అది రద్దుకావడంతో రాజోలుకు మారారు. రాజోలులో 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన వరప్రసాద్ కు ఈసారి 318 ఓట్లు వచ్చాయి. ఈయన బిజెపిలోకి వెళ్లినా, ఆయన ఇండిపెండెంటుగా బ్యాలెట్ పత్రంలో ఉండటమే కారణం. కాంగ్రెస్ అభ్యర్ధి విజయప్రసాద్ కు 1119 ఓట్ల మాత్రమే వచ్చి డిపాజిట్ కోల్పోయారు. 
రాజోలుకు 14సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఆరుసార్లు గెలిచాయి... టిడిపి ఐదుసార్లు గెలుపొందాయి. 1952,55లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న రెండుసార్లు సిపిఐ గెలిచింది కానీ, ఆ తర్వాత సిపిఐ గెలవలేదు. ఒకసారి ఇండిపెండెంటు అభ్యర్ధి బి.గోపాలకృష్ణారావు  ఆ ప్రాంత ప్రముఖుడు రుద్రరాజు రామలింగరాజును ఓడించడం ఒక సంచలనం. టిడిపి నేత అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు నాలుగుసార్లు గెలిచారు.ఆయన ఒకసారి ఉప సభాపతి పదవిని నిర్వహించారు. రుద్రరాజు రామలింగరాజు ఎమ్మెల్సీ కూడా ఎన్నికయ్యారు. రామలింగరాజు గతంలో కాసు, పివి. అంజయ్యల మంత్రివర్గాలలో సభ్యునిగా ఉన్నారు. 

Activities are not Found
No results found.