పర్చూరు - పర్చూరు

పర్చూరు
పర్చూరు

2014 సాధారణ ఎన్నికలలో పర్చూరు శాసనసభ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్ధి వై.సాంబశివరావు ఘనవిజయం సాధించారు. ఆయన తన సమీప వైసిపి ప్రత్యర్ధి గొట్టిపాటి భరత్ పై 10775 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  సాంబశివరావు తొలిసారి చట్టసభకు ఎన్నికయ్యారు. ఓడిపోయిన భరత్  మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కుమారుడు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎం.కృష్ణారెడ్డికి 1277 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2004,2009లలో కాంగ్రెస్ తరపున విజయం సాధించిన సీనియర్ నేత డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2014లో రాజకీయ సన్యాసం చేశారు. ఆయన పోటీలో లేరు. దగ్గుబాటి మొత్తం ఐదుసార్లు గెలిచారు.  ఆయన మార్టూరులో ఒకసారి, పర్చూరులో నాలుగుసార్లు గెలిచారు. ఒకసారి లోక్ సభకు , మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. గతంలో టిడిపి నాయకుడిగా ఉన్న దగ్గుబాటి ఎన్టీఆర్ పెద్ద అల్లుడు. పార్టీ చీలిక తర్వాత జరిగిన పరిణామాలలో ఈయన కొంతకాలం వేర్వేరు పార్టీలలో ఉండి , చివరకు కాంగ్రెస్ లో చేరారు. ఆయన భార్య, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరిని కూడా ఆయన కాంగ్రెస్ లో చేర్చారు. ఆమె బాపట్ల నుంచి లోక్ సభకు తొలిసారి 2004లో ఎన్నికై  కేంద్రమంత్రి పదవిని చేపట్టారు. బాపట్ల 2009లో రిజర్వుడ్ నియోజకవర్గంగా మారడంతో విశాఖ నుంచి మరోసారి గెలిచి కేంద్రంలో మంత్రి పదవి నిర్వహించారు. తెలంగాణ నిర్ణయం నేపధ్యంలో పురందేశ్వరి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరారు.రాజంపేట నుంచి లోక్ సభ కు పోటీ చేసి ఓడిపోయారు. దగ్గుబాటి గతంలో ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా పని చేశారు. 
పర్చూరు 14సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఏడుసార్లు, టిడిపి ఐదుసార్లు, సిపిఐ ఒకసారి గెలిచాయి. ఇండిపెండెంటు ఒకసారి నెగ్గారు. మరో సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి పర్చూరులో మూడుసార్లు గెలవగా, రెండుసార్లు బాపట్లలో గెలుపొందారు. మొత్తం ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈసారి ఆయన కూడా పోటీ చేయలేదు. గాదె 1993లో కోట్ల క్యాబినెట్ లో మంత్రిగా ఉండగా, 2009లో తిరిగి వైఎస్ క్యాబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.  రోశయ్య క్యాబినెట్లో కూడా కొనసాగారు. 1999లో గెలిచిన జాగర్లమూడి లక్ష్మీ పద్మావతి అప్పట్లో చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్నారు. మద్దుకూరి నారాయణరావు ఇక్కడ రెండుసార్లు గెలిచారు. 

Activities are not Found
No results found.
By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close