గంగాధర నెల్లూరు - గంగాధర నెల్లూరు

గంగాధర నెల్లూరు
గంగాధర నెల్లూరు

2014 సాధారణ ఎన్నికలలో గంగాధర నెల్లూరు రిజర్వుడ్ శాసన సభ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్ధి కె.నారాయణ స్వామి విజయం సాధించారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే గుమ్మడి కుతుహలమ్మపై 20565 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.గతంలో కాంగ్రెస్ తరపున సత్యవేడులో గెలిచిన నారాయణస్వామి రెండోసారి ఇక్కడ వైసిపి తరపున ఇక్కడ గెలిచారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎస్.నరసింహులుకు 1967 ఓట్లు వచ్చాయి. కుతూహలమ్మ 2009లో కాంగ్రెస్ తరపున ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పాటు నేపధ్యంలో ఎన్నికల ముందు టిడిపిలో చేరి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. 
కుతూహలమ్మ గతంలో వేపంజేరి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు, గంగాధర నెల్లూరులో ఒకసారి , మొత్తం ఐదుసార్లు గెలిచారు. ఆమె నేదురుమల్లి క్యాబినెట్ లో పని చేశారు. డిప్యూటీ స్పీకర్ గా కూడా పదవిని నిర్వహించారు. వేపంజేరి లో మునిస్వామప్ప రెండుసార్లు గెలిచారు.  జనరల్ స్థానంగా ఉన్నప్పుడు ఎన్పీ చెంగల్రాయుడు ఒకసారి గెలిచారు. ఆయన ఒకసారి లోక్ సభ, మరోసారి రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. టిడిపి తరపున ఆర్ .గాంధీ ఒకసారి వేపంజేరి నుంచి ఎన్నికయ్యారు. 

Activities are not Found
No results found.