నగరి - నగరి

నగరి
నగరి

2014 సాధారణ ఎన్నికలలో నగరి శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రముఖ సినీ నటి, వైసిపి అభ్యర్ధి ఆర్కే రోజా విజయం సాధించారు. టిడిపి సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడును ఓడించారు. రోజాకు 858 ఓట్ల ఆధిక్యత వచ్చింది. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి ఆర్.చెంగారెడ్డి కుమార్తె వాకాటి సత్య స్వరూప ఇందిర కుమారికి 5170 ఓట్లు వచ్చాయి. రోజా గతంలో ఒకసారి నగరి, మరోసారి చంద్రగిరిలోను టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో టిడిపి మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్న రోజా, తర్వాత వైసిలోకి వచ్చారు. 
నగరి నియోజకవర్గానికి 12సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ లు కలిసి ఏడుసార్లు, టిడిపి మూడుసార్లు, వైసిపి ఒకసారి గెలిచాయి. ఇండిపెండెంటు ఒకసారి గెలుపొందారు. 1983లో టిడిపితో రాజకీయ రంగప్రవేశం చేసిన గాలి ముద్దుకృష్ణమనాయుడు నాలుగుసార్లు ఆ పార్టీ అభ్యర్ధిగా గెలుపొందారు. 1995లో పార్టీ చీలిక తర్వాత పరిణామాల్లో 1999లో కాంగ్రెస్ లో చేరారు. కానీ ఓడిపోయారు తిరిగి 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. తిరిగి 2009 నాటికి టిడిపిలోకి వచ్చి మాజీ మంత్రి చెంగారెడ్డిపై నగరిలో గెలిచారు. కానీ 2014లో ఓడిపోయారు.  ముద్దు గతంలో ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా పని చేశారు. మరో సీనియర్ నేత చెంగారెడ్డి గతంలో చెన్నారెడ్డి, నేదురుమల్లి, కోట్ల, వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గాలలో పని చేశారు. 2014లో ఆయన పోటీ చేయకుండా తన కుమార్తెను రంగంలోకి దింపిన ఫలితం దక్కలేదు. ఇక్కడ రెండుసార్లు గెలిచిన కిలారి గోపాలనాయుడు మంత్రిగా పని చేశారు. ఇక్కడ ఒకసారి గెలిచిన ఇవి.గోపాలరాజు , పుత్తూరులో కూడా మరోసారి గెలుపొందారు. ఈయన నాదెండ్ల నెలరోజుల క్యాబినెట్ లో సభ్యునిగా ఉన్నారు. 

Activities are not Found
No results found.