చింతలపూడి - చింతలపూడి

చింతలపూడి
చింతలపూడి

2014 సాధారణ ఎన్నికలలో చింతలపూడి రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్ధి పితల సుజాత గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎం.రాజేష్ కుమార్ భార్య దేవిప్రియ వైసిపి తరపున పోటీ చేశారు. సుజాత చింతలపూడిలో 15164 ఓట్ల మెజార్టీతో దేవిప్రియపై గెలుపొందారు పీతల సుజాత. సుజాత  ఆ తర్వాత చంద్రబాబు క్యాబినెట్ లో కొంతకాలం మంత్రిగా పని చేశారు. 2009లో రాజేష్ కాంగ్రెస్ తరపున గెలిచిన, రెండోసారి ప్రభుత్వంపై ఆవిశ్వాసం పెట్టినప్పుడు వైసిపిలోకి వెళ్లి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి అనర్హతకు గురయ్యారు.  ఆ తర్వాత ఆయన పోటీ చేయకపోయినా ఆయన భార్య దేవిప్రియను రంగంలో దించినా ప్రయోజనం దక్కలేదు. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన వై.రాజారావుకు 1650 ఓట్లు మాత్రమే వచ్చాయి. 
1967 నుంచి 2004 వరకు జనరల్ కోటాలో ఉన్న చింతలపూడి నియోజకవర్గం 2009లో రిజర్వుడుగా మారింది. దాంతో ఇక్కడ ఐదుసార్లు గెలుపొందిన సీనియర్ నేత కోటగిరి విద్యాధరరావు ఈ స్థానం రిజర్వుడు కావడంతో 2009లో ఉంగుటూరులో పోటీ చేసి పరాజయం పొందారు. 
విధ్యాధరరవు 1983 నుంచి 1999 వరకు ఐదుసార్లు వరుసగా గెలిచారు. 2004లో చింతలపూడిలో తొలిసారి ఓడియారు. 
విద్యాధరరావు తప్ప మరోకరు చింతలపూడిలో రెండోసారి గెలవలేదు. 
చింతలపూడిలో 12 సార్లు ఎన్నికలు జరిగితే. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఐదుసార్లు, టిడిపి ఐదుసార్లు, సిపిఐ ఒకసారి గెలుపొందాయి.ఒకసారి ఇండిపెండెంట్లు నెగ్గారు. 

Activities are not Found
No results found.