దెందులూరు - దెందులూరు

దెందులూరు
దెందులూరు

2014 సాధారణ ఎన్నికలలో దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి విజయం సాధించారు. 17746 ఓట్ల మెజార్టీతో రెండోసారి గెలుపొందారు చింతమనేని. తణుకు సిట్టింగ్ ఎమ్మెల్యే కారుమూరు వెంకట నాగేశ్వరరావు వైసిపిలో చేరి దెందులూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక కాంగ్రెస్ అభ్యర్ధి మాగంటి వీరంద్ర ప్రసాద్ కు 2527 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014లో ప్రభాకర్ ప్రభుత్వ విప్ గా నియమితులయ్యారు. 2004లో కాంగ్రెస్ తరపున గెలుపొందిన మాగంటి వెంకటేశ్వరరావు , ఆ తర్వాత వైఎస్ క్యాబినెట్ లో సభ్యుడయ్యారు. అయితే ఒక జెడ్పీటిసి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినందుకుగాను మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరడంతో అవమానంగా భావించిన మాగంటి శాసనసభ్యత్వాన్ని వదులుకున్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి టిడిపిలో చేరారు. ఏలూరు నుంచి లోక్ సభకు టిడిపి అభ్యర్ధిగా రంగంలోకి దిగి 2009లో ఓడిపోయారు. అయితే 2014లో గెలువగలిగారు. మాగంటి బాబు తండ్రి రవీంద్రనాథ్ చౌదరి గతంలో జెడ్పీ ఛైర్మన్, రాష్ట్రమంత్రిగా పని చేశారు. 1991లో నేదురుమల్లి క్యాబినెట్ లో చేరడానికి ప్రమాణస్వీకారం చేసిన కాసేపటికే గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత జరిగిన ఉప  ఎన్నికలో రవీంద్రనాథ్ భార్య వరలక్ష్మి గెలుపొంది కొంతకాలంగా మంత్రిగా పని చేశారు. తండ్రి,తల్లి,కుమారుడు ముగ్గురు మంత్రులుగా పని చేసిన అరుదైన గౌరవం ఈ కుటుంబానికి దక్కింది. మాగంటి బాబు ఏలూరు నుంచి లోక్ సభకు 1998లో కూడా ఎన్నికయ్యారు.  దెందులూరులో టిడిపి నేత గారపాటి సాంబశివరావు నాలుగుసార్లు, అసెంబ్లీకి ఎన్నికయ్యారు.  ఈయన ఎన్టీఆర్ కు సమీప బంధువు. మరో నేత ఎం.రామ్మోహన్ రావు మూడుసార్లు గెలిస్తే, అందులో ఒకసారి ఏకగ్రీవం కావడం విశేషం.  
దెందులూరుకు 14సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఏడుసార్లు, టిడిపి ఆరుసార్లు, ఇండిపెండెంటు ఒకసారి గెలిచారు. 

Activities are not Found
No results found.