పోలవరం - పోలవరం

2014 సాధారణ ఎన్నికలలో పోలవరం శాసనసభ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్ధి ముడియం శ్రీనివాసరావు విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే , వైసిపి అభ్యర్ధి తెల్లం బాలరాజు ను 15720 ఓట్ల ఆధిక్యతతో ముడియం ఓడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు దానికి మద్దతిచ్చిన బాలరాజు అనర్హత వేటుకు గురయ్యారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో గెలిచిన బాలరాజు 2014 సాధారణ ఎన్నికలో ఓటమి పాలయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కెపి.రత్నంకు 2062 ఓట్ల మాత్రమే వచ్చాయి. టిడిపి తరపున గెలిచిన ముడియం శ్రీనివాసరావు, అంతకుముందు ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచిన లక్ష్మణరావులు ఒకే కుటుంబానికి చెందినవారు. 2009లో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలరాజు , మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్నదొరపై గెలవడం ద్వారా మరోసారి చట్టసభలోకి ప్రవేశించారు. ఈ నియోజకవర్గంలో టిడిపి నేత ముడియం లక్ష్మణరావు, తెల్లం బాలరాజు మాత్రమే రెండేసిసార్లు గెలుపొందారు. 1999లో టిడిపి అభ్యర్ధి వంకా శ్రీనివాసరావు అతి తక్కువగా 24 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఒక ఉప ఎన్నికతో సహా 14సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఏడుసార్లు, టిడిపి ఐదుసార్లు గెలిచాయి. సిపిఐ ఒకసారి, ఇండిపెండెంటు మరోసారి విజయం సాధించారు.