అవనిగడ్డ - అవనిగడ్డ

అవనిగడ్డ
అవనిగడ్డ

2014 సాధారణ ఎన్నికలలో అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గంలో టిడిపి విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేసిన మండలి బుద్దప్రసాద్ అనుహ్యంగా 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరి విజయం సాధించారు. ఆయన తన సమీప వైసిపి ప్రత్యర్ధి సింహాద్రి రమేష్ పై 5958 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  అనంతరం చంద్రబాబు క్యాబినెట్ లో డిప్యూటీ స్పీకర్ పదవిని పొందారు బుద్ద ప్రసాద్. అంతకుముందు రెండుసార్లు కాంగ్రెస్, మూడోసారి టిడిపి తరపున గెలిచారు. ఆయన కుటుంబం 50ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉండి, తాజా పరిణామాలతో పార్టీ మారడం విశేషం. ఇక్కడ బిఎస్పీ తరపున పోటీ చేసిన పి.అంబేద్కర్ కు 4486 ఓట్లు వస్తే, కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎం.వెంకటేశ్వరరావుకు 2091 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2009లో ఇక్కడ గెలిచిన టిడిపి నేత అంబటి బ్రాహ్మణయ్య మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో మిగిలిన రాజకీయపార్టీలు బ్రహ్మణయ్యపై గౌరవంతో పోటీ చేయలేదు. బ్రాహ్మణయ్య కుమారుడు అంబటి శ్రీహరి ప్రసాద్ పోటీ చేసి గెలుపొందారు. కానీ సాధారణ ఎన్నికలలో టిడిపి ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. 
ఇక్కడ ఒకసారి గెలిచిన బ్రహ్మాణయ్య 1994లో బందరులో ఎమ్మెల్యేగా, 1999లో మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 
అవనిగడ్డకు 12సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఏడుసార్లు, టిడిపి ఐదుసార్లు గెలిచాయి. అవనిగడ్డలో రెండుసార్లు గెలిచిన చల్లపల్లి జమిందార్ రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ దివి నియోజకవర్గంలో మరోసారి గెలుపొందారు. 
శివరామప్రసాద్ గతంలో కాసు మంత్రివర్గంలో ఉన్నారు. మండలి వెంకటకృష్ణారావు ఒకసారి ఏకగ్రీవంతో సహా మొత్తం మూడుసార్లు ఎన్నికయ్యారు. మండలి ఒకసారి ఎంపిగా కూడా గెలిచారు. ఈయన పివి, జలగం మంత్రివర్గాలలో ఉన్నారు. జిల్లా శాసనసభ్యులలో ఏకగ్రీవంగా గెలిచిన గౌరవం ఈయన ఒక్కరికే దక్కింది. సింహాద్రి సత్యనారాయణ మూడుసార్లు గెలిచారు. సింహాద్రి గతంలో చంద్రబాబు మంత్రివర్గంలో పని చేశారు. బుద్దప్రసాద్ గతంలో వైఎస్ క్యాబినెట్లో ఉన్నారు. తండ్రికొడుకులైన మండలి కృష్ణారావు, బుద్దప్రసాద్ లు మంత్రులుగా పని చేయడం విశేషం. దివి నియోజకవర్గంలో ఒకసారి గెలిచిన చండ్ర రామలింగయ్య గెలవగా, ఆయన సోదరుడు ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు రాజేశ్వరరావు ఇక్కడ పోటీ చేసి చల్లపల్లి రాజా చేతిలో ఓడిపోయారు. దివి నియోజకవర్గంలో ఒకసారి గెలిచిన గుంటూరు బాపనయ్య, నిడమోలు నుంచి మరో రెండుసార్లు విజయం సాధించారు. 

Activities are not Found
No results found.
By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close
Telegram Connect With Telegram