మచిలీపట్టణం - మచిలీపట్నం

మచిలీపట్నం
మచిలీపట్నం

2014 సాధారణ ఎన్నికలలో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి  టిడిపి నేత కొనకళ్ల నారాయణరావు మరోసారి ఎన్నికయ్యారు. ఆయన తన సమీప వైసిపి ప్రత్యర్ధి కె.పార్ధసారథి పై 81057 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కొనకళ్లకు 587280 ఓట్లు రాగా, మాజీ మంత్రి పార్థసారధికి 506223 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ తరపున పోటీ చేసిన శిష్టా రమేష్ కు 14111 ఓట్లు మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోయారు. లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఆరు స్థానాల్లో టిడిపి, ఒక స్థానంలో వైసిపికి ఆధిక్యత లభించింది. టిడిపికి గన్నవరంలో 9046, పెడనలో 16345, మచిలీపట్నంలో 17051, అవనిగడ్డలో 10230, పామర్రులో 342, పెనమలూరులో 30707 ఓట్ల మెజార్టీ లభించింది.  వైసిపికి గుడివాడలో 3222 ఓట్ల ఆధిక్యత వచ్చింది. 
మచిలీపట్నం లోక్ సభ స్థానానికి 16సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి 9సార్లు, టిడిపి 5సార్లు, సిపిఐ ఒకసారి, ఇండిపెండెంట్ ఒకసారి గెలుపొందారు. మాగంటి అంకినీడు ఇక్కడ రెండుసార్లు, గుడివాడలో మూడుసార్లు మొత్తం ఐదుసార్లు గెలిచారు. అంకినీడు మేనల్లుడు కావూరి సాంబశివరావు బందరులో మూడుసార్లు, ఏలూరులో రెండుసార్లు గెలిచి కేంద్రంలో మంత్రి కూడా నిర్వహించారు. మేడూరి నాగేశ్వరరావు బందరులో ఒకసారి, తెనాలిలో రెండుసార్లు గెలిచారు. కొనకళ్ల నారాయణ వరుసగా రెండుసార్లు గెలుపొందారు. సనకా బుచ్చి కోటయ్య, మండలి వెంకట కృష్ణారావు, మండలి వెంకటస్వామి, యార్లగడ్డ అంకినీడు ప్రసాద్, కెపి.రెడ్డయ్య, సినీ నటుడు కైకాల సత్యనారాయణ, అంబటి బ్రహ్మణయ్య, బాడిగ రామకృష్ణ ఒక్కోసారి గెలిచారు. 

Activities are not Found
No results found.