పామర్రు - పామర్రు

పామర్రు
పామర్రు

2014 సాధారణ ఎన్నికలలో పామర్రు రిజర్వుడు శాసనసభ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్ధి ఉప్పులేటి కల్పన విజయం సాధించారు. ఆమె తన సమీప టిడిపి ప్రత్యర్ధి వర్ల రామయ్యను 1069 ఓట్ల మెజార్టీతో ఓడించారు. కల్పన గతంలో టిడిపి తరపున రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఆమె 2014 ఎన్నికలకు ముందు వైసిపిలోకి మారి గెలుపొందారు.  పామర్రుకు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే డివై.దాస్  8237 ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయారు. పామర్రులో టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు ఉండటం విశేషం. అయినా గత రెండుసార్లు ఇక్కడ టిడిపి విజయం సాధించలేకపోయింది. 
గతంలో ఇక్కడ ఉన్న నిడుమోలు నియోజకవర్గం రద్దై పామర్రు ఏర్పడింది. నిడుమోలు నియోజకవర్గంలో ప్రముఖ సిపిఎం నాయకుడు గుంటూరు బాపనయ్య రెండుసార్లు , మరోసారి దివి నియోజకవర్గంలో గెలచారు. ఆయన మరణం తర్వాత గుంటూరు ధనసూర్యావతి ఉప ఎన్నికలో గెలుపొందారు.  మరో ప్రముఖ సిపిఎం నాయకుడు పాటూరు రామయ్య నాలుగుసార్లు గెలుపొందారు. మరో నేత కనుమూరు సోమేశ్వరరావు రెండుసార్లు గెలిచారు.

Activities are not Found
No results found.