పెడన - పెడన

పెడన
పెడన

2014 సాధారణ ఎన్నికలలో పెడన నియోజకవర్గం నుంచి టిడిపి సీనియర్ నేత కాగిత వెంకరావు నాలుగోసారి విజయం సాధించారు. ఆయన తన సమీప వైసిపి ప్రత్యర్ధి బూరగడ్డ వేదవ్యాస్ పై 13694 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పి.విశ్వేశ్వరరావుకి 962 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగిత వెంకటరావు గతంలో చీఫ్ విప్ గా పని చేయగా, వేదవ్యాస్ డిప్యూటీ స్పీకర్ గా పని చేశారు. 
కాగిత వెంకట్రావు గతంలో మల్లేశ్వరం నుంచి మూడుసార్లు గెలిచారు. మల్లేశ్వరంలో పిన్నింటి పమిడేశ్వరరావు మూడుసార్లు, బూరగడ్డ నిరంజనరావు రెండుసార్లు, నిరంజనరావు కుమారుడైన వేదవ్యాస్ రెండుసార్లు గెలుపొందారు. 1983లో మల్లేశ్వరంలో గెలిచిన అంకెం ప్రభాకరరావు కొద్దికాలం ఎన్టీఆర్ క్యాబినెట్ లో ఉన్నారు. 
మల్లేశ్వరం, పెడన నియోజకవర్గాలకు కలిపి 13సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఆరుసార్లు, టిడిపి ఐదుసార్లు, జనతాపార్టీ ఒకసారి, ఇండిపెండెంటు మరోసారి గెలిచారు. 

Activities are not Found
No results found.