పెనమలూరు - పెనమలూరు

పెనమలూరు
పెనమలూరు

2014 సాధారణ ఎన్నికలలో పెనమలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్ధి బోడే ప్రసాద్ విజయం సాధించారు. ఆయన తన సమీప వైసిపి అభ్యర్ధి కె.విద్యాసాగర్ పై 31448 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. విద్యాసాగర్ తండ్రి నాగేశ్వరరావును మొదట మచిలీపట్నం నుంచి లోక్ సభకు పోటీ చేయాలని నిర్ణయించారు. కాని ఆయన అకస్మాత్తుగా మరణించడంతో ఆ టిక్కెట్ ను ఈయనకు కేటాయించారు. తదుపరి పరిణామాలో మాజీ మంత్రి , 2009లో ప్రాతినిధ్యం వహించిన కెవి.పార్ధసారధికి బందరు టిక్కెట్ ఇచ్చి, విద్యాసాగర్ కు పెనమలూరు టిక్కెట్ ఇచ్చారు. అయినా ఇద్దరూ పరాజయం పాలయ్యారు. ఇక కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన ఎస్.శోభన్ బాబుకు కేవలం 3386 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉయ్యూరు నియోజకవర్గం స్థానంలో పెనమలూరు నియోజకవర్గం ఏర్పడింది. 
రద్దైన ఉయ్యూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రముఖ స్వాతంత్రయోధుుడు , మాజీ పిసిసి అధ్యక్షుడు కాకాని వెంకటరత్నం మూడుసార్లు గెలిచారు. కాకాని గన్నవరంలో కూడా మరోసారి విజయం సాధించారు.  ఈయన గతంలో కాసు, పివి మంత్రివర్గాల్లో పని చేశారు. మరో ప్రముఖ నేత వడ్డేశోభనాద్రీశ్వరరావు ఉయ్యూరులో ఒకసారి, మైలవరంలో మరోసారి గెలిచారు. వడ్డే విజయవాడ నుంచి లోక్ సభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. వడ్డే 1999లో అసెంబ్లీకి గెలిచాక చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి అయ్యారు. మరో నేత అన్నె బాబురావు  ఉయ్యూరులో మూడుసార్లు గెలవగా, ఆయన మరణం కారణంగా జరిగిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి అన్నె విజయలక్ష్మి గెలుపొందారు. ఉయ్యూరులో ఒకసారి గెలిచిన కెవి.రెడ్డయ్య ఉయ్యూరు, పెనమలూరులో గెలిచిన పార్థసారధిలు తండ్రి , కొడుకులు. రెడ్డయ్య ఒకసారి ఎంపిగా టిడిపి తరపున గెలిచి, ఆ తర్వాత పివి ప్రభుత్వాన్ని కాపాడపాడినికిగాను పార్టీ మారారు. ఉయ్యూరులో ఒకసారి గెలిచిన వంగవీటి చలపతిరావు, విజయవాడ తూర్పులో ఒకసారి గెలిచిన వంగవీటి మోహనరంగాలు సోదరులు. పార్థసారధి కాంగ్రెస్ లో2009లో గెలిచినప్పుడు వైఎస్ , రోశయ్య, కిరణ్ ల మంత్రివర్గాలలో పని చేశారు. 

Activities are not Found
No results found.
By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close