శ్రీశైలం - శ్రీశైలం

శ్రీశైలం
శ్రీశైలం

2014 సాధారణ ఎన్నికల నుంచి ఆత్మకూరు పేరుతో ఉన్న శాసనసభ నియోజకవర్గం శ్రీశైలం గా మారింది. ఈ ఎన్నికలలో వైసిపి అభ్యర్ధి బుడ్డా రాజశేఖరరెడ్డి విజయ సాధించారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ధి శిల్పా చక్రపాణి రెడ్డిపై 4861 ఓట్ల మెజార్టీతో గెలిచారు.  కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేసిన షబ్న మెరిన్ కు 1290 ఓట్లు వచ్చాయి. రాజశేఖర రెడ్డి కూడా రాజకీయ కుటుంబానికి చెందినవారే. ఆయన తండ్రి వెంగళరెడ్డి , సోదరుడు సీతారామిరెడ్డి ఆత్మకూరు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజశేఖరరెడ్డి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 
2009లో ఇక్కడ గెలిచిన ఏరాసు ప్రతాపరెడ్డి కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి మారి పాణ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రతాపరెడ్డి టిడిపిలో చేరే ముందు, రాష్ట్రపతి పాలన వచ్చే వరకు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా పని చేశారు. ఆయన మొత్తం మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రతాపరెడ్డి కర్నూలు జిల్లాలో సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది అయ్యపురెడ్డి కుమారుడు.  నాలుగుసార్లు శాసనసభకు గెలుపొందారు. ఒకసారి ఏకగ్రీవంగా కూడా గెలిచారు. 1984లో టిడిపి తరపున లోక్ సభ ఎన్నికలకు పోటీ చేసి కోట్ల విజయభాస్కరరెడ్డిని అయ్యపురెడ్డి ఓడించారు.  కొంతకాలం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆయన, కాంగ్రెస్ పార్టీలోకి మారి అంజయ్య ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలో రెండు కుటుంబాల వారే 1983 నుంచి ప్రాతినిధ్యం వహించారు. బుడ్డా వెంగళరెడ్డి 1983,85,89లలో గెలిస్తే, ఆయన కుమారుడు సీతారామిరెడ్డి 1999లో గెలిచారు. 2014లో బుడ్డా రాజశేఖరరెడ్డి గెలిచారు. బుడ్డా వెంగళరెడ్డిని 1999కి ముందు నక్సలైట్లు హతమార్చారు. ఎరాసు ప్రతాపరెడ్డి 1994,2004, 2009లలో గెలుపొందారు. 1978లో గెలిచిన ఎ.వెంగళరెడ్డి కొంతకాలం మంత్రిగా పని చేశారు. 

Activities are not Found
No results found.