ఆచంట - ఆచంట

ఆచంట
ఆచంట

2014 సాధారణ ఎన్నికలలోను ఆచంట శాసనసభ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మూడోసారి విజయం సాధించారు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టిడిపిలో చేరిన పితాని, అప్పటి సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితుడుగా ఉండేవారు. కిరణ్ జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించినపుడు కొద్దిరోజులు ఆయనతోపాటు ఉన్నా.. ఆ తర్వాత టిడిపిలో చేరిపోయారు. పితాని తన సమీప ప్రత్యర్ధి, మాజీ ఎమ్మెల్యే ఎం.ప్రసాదరాజుపై 3920 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  ప్రసాదరాజు 2009లో కాంగ్రెస్ తరపున గెలిచారు. కాంగ్రెస్ లో జరిగిన పరిణామాలలో ఆయన జగన్ పక్షాన నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి , అనర్హత వేటుకు గురయ్యారు. ఆ తర్వాత నరసాపురంలో జరిగిన ఉప ఎన్నికలో ఓటమిపాలయ్యారు. 2014లో ఆచంట నుంచి పోటీ చేసినా గెలుపొందలేకపోయారు. ఆచంటలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రామానుజరావుకు కేవలం 1641 ఓట్లు మాత్రమే వచ్చాయి. పితాని 2004లో పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచారు. 2009లో ఆ నియోజకవర్గం రద్దు కావడంతో ఆచంట నియోజకవర్గానికి మారి పోటీ చేసిన పితాని గెలవడమేకాకుండా వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రివర్గాలలో స్థానం పొందారు. 
1962 నుంచి రిజర్వుడ్ నియోజకవర్గంగా ఉన్న ఆచంట 2009లో జనరల్ కేటగిరిలోకి వచ్చింది. ఇక్కడ మొత్తం 12సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐలు కలిసి నాలుగుసార్లు, టిడిపి నాలుగుసార్లు, సిపిఎం మూడుసార్లు, సిపిఐ ఒకసారి గెలిచాయి. ఆచంటలో సిపిఎం అభ్యర్ధిగా దిగుబాటి రాజగోపాల్ రెండుసార్లు గెలిస్తే.. దాసరి పెరుమాళ్లు, పి.శ్యామసుందరరావు వేర్వేరు చోట్ల రెండేసిసార్లు గెలుపొందారు. 

Activities are not Found
No results found.