భీమవరం - భీమవరం

భీమవరం
భీమవరం

2014 సాధారణ ఎన్నికలలో భీమవరం శాసనసభ నియోజకవర్గంలో టిడిపి విజయం సాధించింది. పి.రామాంజనేయులు 2009లో కాంగ్రెస్ తరపున గెలవగా, 2014లో టిడిపిలో చేరి ఆ పార్టీ తరపున పోటీచేసి మళ్లీ గెలుపొందారు. తన సమీప వైసిపి ప్రత్యర్ధి మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై 13726 మెజార్టీతో గెలిచారు. 2009లో టిడిపి ఇక్కడ మూడో స్థానంలో నిలవగా, 2014లో గెలుపు సాధించింది. కాంగ్రెస్ అభ్యర్ధి వై.రాముకు 2348 ఓట్లు వచ్చి డిపాజిట్ కోల్పోయారు. 
భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పివి.నరసింహరాజు నాలుగుసార్లు టిడిపి తరపున గెలిచారు. నాచు వెంకట్రామయ్య, భూపతిరాజు విజయ్ కుమార్ రాజు లు రెండేసి సార్లు నెగ్గారు. విజయ్ కుమార్ రాజు తండ్రి సుబ్బరాజు కూడా ఒకసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. విజయకుమార్ రాజు లోక్ సభ కు నరసాపురం నుంచి మూడుసార్లు గెలిచారు. భీమవరంలో ఒకసారి గెలిచిన అల్లూరి సుభాష్ చంద్రబోస్ నరసాపురం లోక్ సభ స్థానానికి ఒకసారి ఎన్నికయ్యారు. భీమవరంలో ఒకసారి గెలుపొందిన కలిదిండి విజయనరసింహరాజు అత్తిలిలో కూడా రెండుసార్లు విజయం సాధించారు. సుభాష్ చంద్రబోస్ కొద్దికాలం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. విజయ్ కుమార్ రాజు 1991లో టిడిపి నేతగా ఉన్నప్పుడు ఆనాటి ప్రధాని పివి.నరసింహరావుకు మద్దతు ఇవ్వడానికిగాను పార్టీ మారారు. 

Activities are not Found
No results found.