నర్సాపురం - నర్సాపురం

నర్సాపురం
నర్సాపురం

2014 సాధారణ ఎన్నికలలో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్ధి ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు గెలిచారు.  ఆయన వైసిపి అభ్యర్ధి వంకా రవీంద్రనాథ్ పై 85351 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రవీంద్రనాథ్ కు 454955 ఓట్లు వస్తే, కాంగ్రెస్ తరపున పోటీ చేసిన టిటిడి మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు 27083 ఓట్లు మాత్రమే తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయారు. ఒక్క ఆచంటలో తప్ప మిగిలిన అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బిజెపి-టిడిపి కూటమి అభ్యర్ధి గంగరాజుకు మెజార్టీ లభించింది. బిజెపికి నరసాపురంలో 10451, భీమవరంలో 12832, ఉండిలో 21577, తణుకులో 13270, తాడేపల్లిగూడెంలో 25912, పాలకొల్లులో 11111 ఓట్ల మెజార్టీ లభించింది. వైసిపికి ఆచంటలో 12283 ఓట్ల ఆధిక్యత వచ్చింది. 
నరసాపురం లోక్ సభ స్థానానికి 15సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి 8సార్లు, టిడిపి నాలుగుసార్లు, బిజెపి రెండుసార్లు, సిపిఐ ఒకసారి గెలిచాయి. భూపతిరాజు విజయకుమార్ మూడుసార్లు, బలరామరాజు రెండుసార్లు, అల్లూరి సుభాష్ చంద్రబోస్ రెండుసార్లు, కనుమూరి బాపిరాజు రెండుసార్లు గెలుపొందారు. నటుడు కృష్ణంరాజు ఇక్కడ ఒకసారి గెలవడంతో కేంద్రంలో మంత్రిగా పని చేసే అవకాశం దక్కింది. ఉద్దరాజు రామం, ఎం.టి.రాజు, కె.సుబ్బరాయుడు, హరిరామజోగయ్య ఒక్కోసారి గెలిచారు. 2014లో ఎన్నికైన గంగరాజు, అంతకుముందు రెండుసార్లు గెలిచిన బాపిరాజులు బావ, బావమరుదులు. 

Activities are not Found
No results found.