పాలకొల్లు - పాలకొల్లు

పాలకొల్లు
పాలకొల్లు

2014 సాధారణ ఎన్నికలలో పాలుకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిడిపి కొత్త అభ్యర్ధి నిమ్మల రామానాయుడుని రంగంలోకి దించి విజయం సాధించింది. ఆయన తన సమీప వైసిపి ప్రత్యర్ధి మేకా శేషుబాబును 6388 ఓట్ల మెజార్టీతో ఓడించారు.  శేషుబాబు ఎమ్మెల్సీగా ఉండి, మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. టిడిపి టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ, తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీ చేసి 38420 ఓట్లు తెచ్చుకోవడం విశేషం. నిమ్మల రామానాయుడు మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 
2009లో రాజకీయాల్లోకి సంచలనంగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పాలకొల్లులో ఓడిపోవడం పెను సంచలనం. 2008లో రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీని నెలకొల్పిన చిరు, తన అత్తగారి నియోజకవర్గమైన పాలకొల్లులో పోటీ చేసి , కాంగ్రెస్ అభ్యర్ధి బంగారు ఉషారాణి చేతిలో ఓడిపోవడం విశేషం. గత నాలుగు దశాబ్దాలుగా చిరంజీవి సామాజికవర్గానికే చెందినవారే గెలుస్తున్న ఈ నియోజకవర్గంలో తొలిసారిగా అదే వర్గానికి చెందిన చిరంజీవి ఓటమిపాలయ్యారు. అయితే చిరంజీవి తిరుపతి నుంచి గెలుపొందారు. తదనంతర కాలంలో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి, రాజ్యసభ ఎంపి, యుపిఏ ప్రభుత్వంలో కేంద్ర టూరిజమ్ శాఖ మంత్రిగా కూడా పని చేశారు. అల్లు రామలింగయ్య అలుడైన చిరంజీవి ఇక్కడ ఓడిపోతే , ఆయన సమీప బంధువు అల్లు వెంకటసత్యనారాయణ ఇక్కడ నుంచి గతంలో నాలుగుసార్లు గెలుపొందారు. మరో సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య ఇక్కడ నుంచి రెండుసార్లు, నర్సాపురం నుంచి మరో రెండుసార్లు నెగ్గారు. ఒకసారి ఎంపి కూడా పని చేశారు. దాసరి పెరుమాళ్లు ఇక్కడ ఒకసారి, ఆచంటలో మరోసారి గెలిచారు. మరోనేత అందె సత్యనారాయణ మూర్తి రెండుసార్లు గెలిచారు. హరిరామజోగయ్య గతంలో ఎన్టీఆర్, చెన్నారెడ్డి, కోట్ల క్యాబినెట్ లలో పని చేశారు. ఈయన కొంతకాలం బిజెపి, ప్రజారాజ్యం, వైసిపిలో కూడా ఉన్నారు.  దాసరి పెరుమాళ్లు గతంలో కాసు మంత్రివర్గంలో పని చేశారు. 

Activities are not Found
No results found.