తాడేపల్లిగూడెం - తాడేపల్లిగూడెం

తాడేపల్లిగూడెం
తాడేపల్లిగూడెం

2014 సాధారణ ఎన్నికలలో తాడేపల్లిగూడెం నుంచి టిడిపి మిత్రపక్షం బిజెపి గెలిచింది. బిజెపి అభ్యర్ధి పైడికొండల మాణిక్యాలరావు తన సమీప వైసిపి ప్రత్యర్ధి టిపి.గోపాల సత్యనారాయణ 14073 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తర్వాత చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవిని పొందారు. టిడిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, తనకు టిక్కెట్ రాకపోవడంతో తిరుగుబాటు  అభ్యర్ధిగా బరిలోకి దిగి 17209 ఓట్లు తెచ్చుకుని ఓడిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఈలి నాని కూడా కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి చేరినా, ఆయన పోటీ చేయలేదు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన డి.పద్మావతి 2435 ఓట్లు తెచ్చుకుని ఓడిపోయారు. 
జిల్లాలో ఆరుసార్లు గెలిచిన నేత సిహెచ్ విపి మూర్తిరాజు, తాడేపల్లి గూడెంలో రెండుసార్లు విజయం సాధించారు. పెంటపాడు, ఉంగుటూరులలో మరో నాలుగుసార్లు గెలుపొందారు. తాడేపల్లిగూడెం ప్రముఖుడు ఈలి ఆంజనేయులు రెండుసార్లు గెలిస్తే, ఆయన మరణం తర్వాత ఆయన భార్య వరలక్ష్మి ఒక ఉప ఎన్నికలోను, మరోసారి టిడిపి నేత ఎర్రానారాయణ స్వామి జెడ్పీ ఛైర్మన్ గా ఎన్నికైన తర్వాత జరిగిన ఉప ఎన్నికలోను గెలుపొందారు. 2009లో గెలిచిన మధుసూదనరావుకు ఈలి ఆంజనేయులు తండ్రి. అల్లూరి కృష్ణారావు, ఎర్రా నారాయణస్వామి, పసల కనకసుందరరావులు రెండేసిసార్లు గెలిచారు. మూర్తిరాజు 1972లో పివి మంత్రివర్గంలో సభ్యునిగా ఉన్నారు. ఈలి ఆంజనేయులు గతంలో ఎన్టీఆర్ క్యాబినెట్ లో పని చేయగా, ఎర్రా శాసనమండలి సభ్యునిగా ఉన్నప్పుడు మంత్రిగా పని చేశారు. ఎర్రా ఒకసారి రాజ్యసభ సభ్యుడయ్యారు.
తాడేపల్లిగూడెంకు 16సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఏడుసార్లు, టిడిపి ఏడుసార్లు, ప్రజారాజ్యం ఒకసారి, ఇండిపెండెంటులు ఒకసారి గెలుపొందారు. 

Activities are not Found
No results found.