తణుకు - తణుకు

తణుకు
తణుకు

2014 సాధారణ ఎన్నికలలోను తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి ఘన విజయం సాధించింది. పార్టీ కొత్త అభ్యర్ధి ఆరిమిల్లి రాధాకృష్ణను పోటీ చేయించింది టిడిపి. తన సమీప వైసిపి ప్రత్యర్ధి సి.రాధాకృష్ణను 30948 ఓట్ల ఆధిక్యతతో ఓడించారు. ఇక కాంగ్రెస్ తరపున పోటీ చేసిన బి.భాస్కరరావుకు 1476 ఓట్లు మాత్రమే వచ్చాయి. తణుకు అంటే ముందుగా గుర్తుకు వచ్చే నేత , దివంగత పారిశ్రామిక వేత్త ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్. ఆయన ఈ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచారు.  2009 ఎన్నికలో ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ అల్లుడు వైటి.రాజాను  కాంగ్రెస్ అభ్యర్ధి కారుమూరి నాగేశ్వరరావు ఓడించారు. గన్నమని సత్యనారాయణమూర్తి రెండుసార్లు, గన్నమని అల్లుడు ముళ్లపూడి వెంకటకృష్ణారావు మూడుసార్లు గెలిచారు. హరిశ్చంద్రప్రసాద్ అల్లుడు వైటి.రాజా ఒకసారి గెలిచారు. మరో పారిశ్రామికవేత్త చిట్టూరి ఇంద్రయ్య ఒకసారి గెలిస్తే, ఆయన కుమారులు చిట్టూరి వెంకటేశ్వరరావు, చిట్టూరి బాపినీడులు ఒక్కొక్కసారి గెలుపొందారు. ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ సమీప బంధువు బోళ్ల బుల్లిరామయ్య ఏలూరు నుంచి లోక్ సభకు నాలుగుసార్లు ఎన్నికయ్యారు.  కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. 

Activities are not Found
No results found.