ఉండి - ఉండి

ఉండి
ఉండి

2014 సాధారణ ఎన్నికలలో ఉండి శాసనసభ నియోజవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే , టిడిపి నేత వివి.శివరామరాజు మరోసారి ఘన విజయం సాధించారు. ఈయన జిల్లాలోనే అత్యధిక మెజార్టీ సాధించారు. తన సమీప వైసిపి ప్రత్యర్ధి, మాజీ ఎమ్మెల్యే పి.సర్రాజును 36321 ఓట్ల తేడాతో ఓడించారు. దాంతో శివరామరాజు రెండోసారి గెలిచినట్లుయ్యింది. ఇక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి అబ్బరాజుకు కేవలం 3019 ఓట్లు మాత్రమే వచ్చాయి. 
టిడిపికి కంచుకోటగా ఉన్న ఉండిలో 2004లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. ఆ తర్వాత మళ్లీ వరుసగా టిడిపినే గెలుస్తోంది.  ఉండి నియోజకవర్గానికి 15సార్లు ఎన్నికలు జరిగితే .. కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ లు కలిసి ఏడుసార్లు, టిడిపి ఏడుసార్లు గెలుపొందాయి. ఇండిపెండెంటు ఒకసారి విజయం సాధించారు. 1983 నుంచి 1999 వరకు ఐదుసార్లు గెలిచిన ఘనత టిడిపి నేత కలిదిండి రామచంద్రరాజుకు దక్కింది. ఈయన కొద్దికాలం ఎన్టీఆర్ క్యాబినెట్ లోను, మరికొంతకాలం చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా కొనసాగారు. 1952 నుంచి 1983 వరకు ఏ ఒక్క అభ్యర్ధి రెండోసారి గెలవకపోవడం ఒక ప్రత్యేకత. అయితే 1983 నుంచి ఒక్క కలిదిండి తప్ప మరెవరూ గెలవకపోవడం మరో విశిష్టత. 1967లో ఎన్నికైన కె.కుసుమేశ్వరరావు మరణంతో జరిగిన ఉప ఎన్నికలో కె. అండాళ్లమ్మ గెలిచారు. 

Activities are not Found
No results found.