గోపాలపురం - గోపాలపురం

గోపాలపురం
గోపాలపురం

2014 సాధారణ ఎన్నికలలో గోపాలపురం రిజర్వుడు శాసనసభ నియోజకవర్గంలో ఈసారి టిడిపినే గెలిచింది. గోపాలపురంలో టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసిన ఎం.వెంకటేశ్వరరావు తన సమీప వైసిపి ప్రత్యర్ధి టి.వెంకటరావుపై 11450 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ 2009లో టిడిపి తరపున గెలిచిన టి.వనిత పార్టీని వదిలి వైసిపిలో చేరి అనర్హత వేటుకు గురయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు టిడిపి తటస్థంగా ఉండాలన్న విప్ ను ధిక్కరించడంతో అనర్హత వేటు పడింది.  ఆ తర్వాత ఆమె కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 
వనిత తండ్రి జొన్నకూటి బాబాజిరావు రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 
గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గానికి 12 సార్లు ఎన్నికలు జరిగితే టిడిపి ఏడుసార్లు, కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి నాలుగుసార్లు విజయం సాధించాయి. ఒకసారి ఇండిపెండెంటు నెగ్గారు.  ఇక్కడ నుంచి రెండుసార్లు గెలిచిన టివి.రాఘవులు కొంతకాలం కాసు మంత్రివర్గంలో పని చేశారు. రాఘవులు కొవ్వూరులో కూడా ఒకసారి ఎన్నికయ్యారు. గోపాలపురంలో కారుపాటి వివేకానంద మూడుసార్లు గెలిచారు. గతంలో ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా పని చేశారు. 

Activities are not Found
No results found.