కొవ్వూరు - కొవ్వూరు

కొవ్వూరు
కొవ్వూరు

2014 సాధారణ ఎన్నికలలో కోవూరు శాసనసభ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్ధి పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డి విజయం సాధించారు. 2012 ఉప ఎన్నికలో గెలుపొందిన మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి , సాధారణ ఎన్నికలలో వైసిపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 7937 ఓట్ల ఆధిక్యతతో ప్రసన్నకుమార్ రెడ్డిని ఓడించారు పోలంరెడ్డి. 2009లో టిడిపి తరపున ప్రసన్నకుమార్ రెడ్డి గెలిచారు. కానీ అనతికాలంలోనే ఆయన టిడిపి అసమ్మతి నేతగా మారారు. తర్వాత కాంగ్రెస్ లో జరిగిన పరిణామాలలో ఏర్పడిన వైసిపిలో చేరారు.  ఆ సందర్భంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి ఉప ఎన్నికలో విజయం సాధించారు. అప్పుడు తన సమీప బంధువు, టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై 22వేలకు పైగా మెజార్టీ రాగా, 2014లో 7937 ఓట్ల తేడాతో ఓడిపోవడం విశేషం. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన జివి.రమణకు 1178 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రసన్నకుమార్ రెడ్డి ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈయన కొద్దికాలం ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా పని చేశారు. ప్రసన్నకుమార్ రెడ్డి తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి జిల్లాలో గూడూరు, వెంకటగిరి, కోవూరులలో ఐదుసార్లు గెలిచారు. గతంలో ఈయన అంజయ్య, ఎన్టీఆర్, చెన్నారెడ్డి క్యాబినెట్ లలో మంత్రిగా పని చేశారు. జిల్లాలో ఒక గ్రూపునకు నేదురుమల్లికి వ్యతిరేకంగా నాయకత్వం వహించేవారు. కోవూరులో రెండుసార్లు గెలిచిన పెళ్లకూరు రామచంద్రారెడ్డి ఆత్మకూరులో ఒకసారి గెలిచారు. ఇక్కడ ఒకసారి గెలిచిన వెంకురెడ్డి సర్వేపల్లిలో కూడా మరోసారి గెలుపొందారు. కోవూరులో ఒకసారి గెలుపొందిన రేబాల థశరధరామిరెడ్డి, కావలి, అల్లూరులలో కూడా గెలుపొందారు. ఒకసారి లోక్ సభ సభ్యుడయ్యారు. శాసనసభ స్పీకర్ బాధ్యతలు కూడా నిర్వహించారు. గతంలో ఉన్న బుచ్చిరెడ్డిపాలెం నియోజకవర్గంలో రెండుసార్లు గెలిచిన స్వర్ణ వేమయ్య మరో రెండుసార్లు నెల్లూరు, సర్వేపల్లిలలో గెలుపొందారు. 
కోవూరుకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ లు కలిసి ఆరుసార్లు, టిడిపి ఏడుసార్లు, వైసిపి ఒకసారి, సిపిఐ ఒకసారి గెలిచాయి. 

Activities are not Found
No results found.