రాజమండ్రి సిటీ - రాజమండ్రి సిటీ

రాజమండ్రి సిటీ
రాజమండ్రి సిటీ

2014 సాధారణ ఎన్నికలలో రాజమండ్రి నగరంలో బిజెపి ఘన విజయం సాధించింది. బిజెపి-టిడిపి కూటమి అభ్యర్ధిగా పోటీ చేసిన ఆకుల సత్యనారాయణ, తన సమీప వైసిపి అభ్యర్ధి బొమ్మన రాజకుమార్ పై 26377 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఆకుల సత్యనారాయణ తొలిసారి అసెంబ్లీకు ఎన్నికయ్యారు. ఇక్కడ మరో ప్రముఖుడు ఏపిఐఐసి మాజీ ఛైర్మన్ శివరామసుబ్రహ్మణ్యం జైసమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసి 13309 ఓట్లు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వి.గంగాధర్ కు 2598 ఓట్లు పొంది డిపాజిట్ కోల్పోయారు. 
గతంలో ఇక్కడ నాలుగుసార్లు గెలుపొందిన టిడిపి నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, 2014 ఎన్నికలో రాజమండ్రి రూరల్ నుంచి ఐదోసారి గెలుపొందారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్  కాంగ్రెస్ నుంచి వైసిపిలోకి వెళ్లారు. కానీ పోటీ చేయలేదు. బుచ్చయ్యచౌదరి గతంలో ఎన్టీఆర్ క్యాబినెట్ లో ఉన్నారు. ఆ తర్వాత 1995లో టిడిపి చీలిక సమయంలో ఎన్టీఆర్ పక్షాన ఉన్నారు. ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబు నాయకత్వంలో టిడిపిలో చేరిపోయారు. అధికార తెలుగుదేశంలో చేరిపోయి తిరిగి 1999లో నాలుగోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. తిరిగి 2014 లో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసి గెలిచారు. 
రాజమండ్రి నుంచి సిపిఐ నేత సి.ప్రభాకర చౌదరి రెండుసార్లు గెలుపొందారు. 1955లో నెగ్గిన అంబటిపూడి బాల నాగేశ్వరరావు, ఆంధ్ర రాష్ట్రంలో బెజవాడ గోపాలరెడ్డి క్యాబినెట్ లో సభ్యునిగా ఉన్నారు. 

Activities are not Found
No results found.