కోడూరు - కోడూరు

2014 సాధారణ ఎన్నికలలో వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు మూడోసారి విజయం సాధించారు. తన సమీప టిడిపి అభ్యర్ధి ఓ.సుబ్బరామయ్యపై 1972 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో వైసిపి తరపున 36 వేలకు పైగా మెజార్టీతో గెలిచిన శ్రీనివాసులు, 2014లో తీవ్ర పోటీని ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కె.ఈశ్వరయ్య కు 1694 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నియోజకవర్గం నుంచి ఎన్.పెంచలయ్య, గుంటి శ్రీరాములు, తూమాటి పెంచలయ్యలు రెండేసి సార్లు గెలుపొందారు. గుంటి శ్రీరాము ఒకసారి గెలిచిన వెంకటేశ్వరప్రసాద్ లు ఒకే కుటుంబానికి చెందినవారు.
రైల్వే కోడూరుకు 14 సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి నాలుగుసార్లు, టిడిపి ఐదుసార్లు, స్వతంత్ర పార్టీ రెండుసార్లు, జనతా పార్టీ ఒకసారి గెలిచాయి. రెండుసార్లు వైసిపి గెలిచింది. 1999లో ఇక్కడ టిడిపి తరపు నుంచి గెలిచిన సరస్వతి అప్పట్లో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాతకాలంలో ప్రజారాజ్యం పార్టీలోకి మారి, 2009 ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు.