మదనపల్లె - మదనపల్లె

మదనపల్లె
మదనపల్లె

2014 సాధారణ ఎన్నికలలో మదనపల్లె శాసనసభ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్ధి డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి విజయం సాధించారు. ఆయన తన సమీప బిజెపి ప్రత్యర్ధి చల్లపల్లి నరసింహారెడ్డిపై 16589 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే షాజహాన్ కు 7357 ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్ కోల్పోయారు. తిప్పారెడ్డి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జై సమైక్యాంధ్ర నుంచి పోటీ చేసిన బి.నరేష్ కుమార్ రెడ్డికి 8751 ఓట్లు వచ్చాయి. తిప్పారెడ్డి ఒకసారి ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. 
మదనపల్లెకు 14సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఆరుసార్లు, టిడిపి ఐదుసార్లు, సిపిఐ రెండుసార్లు, వైసిపి ఒకసారి గెలిచాయి. దొడ్ల సీతారామయ్య, అల్లూరి నరసింగరావు, రాటకొండ నారాయణరెడ్డిలు రెండేసిసార్లు గెలుపొందారు. ఇక్కడ ఒకసారి గెలిచిన ఆవుల మోహనరెడ్డి, మరోసారి తంబళ్ళపల్లెలో విజయం సాధించారు. ఇక్కడ గెలిచిన రాటకొండ నారాయణరెడ్డి, రాటకొండ సాగర్ రెడ్డి , శోభ ఒకే కుటుంబానికి చెందినవారు. 

Activities are not Found
No results found.