పీలేరు - పీలేరు

పీలేరు
పీలేరు

2014 సాధారణ ఎన్నికలలో పీలేరు శాసనసభ నియోజకవర్గంలో వైసిపి అభ్యర్ధి చింతల రామచంద్రారెడ్డి మరోసారి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి, జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్ధి, మాజీ సిఎం కిరణ్ సోదరుడు కిషోర్ పై 15313 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో చింతల మూడోసారి చట్టసభకు ఎన్నికైనట్లు అయ్యింది. 2009లో 53వేల ఓట్లకు పైగా మెజార్టీ గెలుపొందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అసలు పోటీలోనే దిగకుండా తన సోదరుడిని రంగంలోకి దించినా ఫలితం దక్కలేదు. కిరణ్ 2004లో ఎన్నికైన తర్వాత చీఫ్ విప్ పదవి పొందారు. 2009లో స్పీకర్, ముఖ్యమంత్రి పదవులు చేపట్టారు. ఇక్కడ టిడిపి అభ్యర్ధి డాక్టర్ కె.ఇక్బాల్ అహ్మద్ ఖాన్ కు 33857 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్ధి షానవాజ్ ఖాన్ కు 1498 ఓట్లు వచ్చాయి. కిరణ్ కుమార్ రెడ్డి మూడుసార్లు వాయల్పాడు(2009లో రద్దు అయ్యింది)లో గెలిచి , నాలుగోసారి పీలేరులో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కిరణ్ తండ్రి అమరనాథరెడ్డి కూడా నాలుగుసార్లు వాయల్పాడు నుండి ఎన్నికయ్యారు. చింతల 2009లో పిఆర్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైసిపిలో చేరి మూడోసారి గెలిచారు. ఈయన తండ్రి సురేంద్రరెడ్డి కూడా ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  
పీలేరుకు 14సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ లు కలిసి ఏడుసార్లు, టిడిపి మూడుసార్లు, కెఎల్పీ రెండుసార్లు, వైసిపి ఒకసారి, సిపిఐ ఒకసారి గెలిచాయి. 2004లో ఎన్నికైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2009,2014లలో పుంగనూరు నుంచి గెలుపొందారు. మంత్రిగా కూడా పని చేశారు.  రామచంద్రారెడ్డి ఇక్కడ మూడుసార్లు, పుంగనూరులో రెండుసార్లు మొత్తం ఐదుసార్లు విజయం సాధించారు. ఇక్కడ ఒకసారి గెలిచిన పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి వాయల్పాడులో మరో మూడుసార్లు గెలుపొందారు. తిమ్మారెడ్డి గతంలో నీలం, కాసు మంత్రివర్గాలలో పని చేశారు. పిసిసి అధ్యక్షుడుగాను ఉన్నారు. ఎం.సైఫుల్లా బేగ్, చల్లా ప్రభాకరరెడ్డి రెండేసిసార్లు విజయం సాధించారు. 

Activities are not Found
No results found.