రాజంపేట - రాజంపేట

రాజంపేట
రాజంపేట

2014 సాధారణ ఎన్నికలలో రాజంపేట నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్ధి పివి.మిథున్ రెడ్డి గెలుపొందారు. ఆయన తన సమీప బిజెపి-టిడిపి కూటమి అభ్యర్ధి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరీపై 174762 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయనకు 601752 ఓట్లు రాగా, బిజెపి అభ్యర్ధి పురందేశ్వరికి 426990 ఓట్లు వచ్చాయి. జై సమైక్యాంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేసిన జి.ముజిబ్ హుస్సేన్ కు 59777 ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయినా మూడోస్థానంలో నిల్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి , కేంద్ర మాజీ మంత్రి ఎ.సాయిప్రతాప్ రెడ్డి 29332 మాత్రమే తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయారు. మిథున్ రెడ్డి  మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసిపికి అధిక్యత లభించింది. రాజంపేటలో 5648, కోడూరులో 9393, రాయచోటిలో 50036, తంబళ్లపల్లెలో 11554, పీలేరులో 33148, మదనపల్లెలో 12019, పుంగనూరులో 46009 ఓట్ల మెజార్టీ వచ్చింది. 
రాజంపేట లోక్ సభ స్థానానికి మొత్తం 15సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి 11సార్లు, టిడిపి రెండుసార్లు, వైసిపి ఒకసారి, స్వతంత్ర పార్టీ ఒకసారి గెలుపొందాయి. సాయి ప్రతాప్ ఆరుసార్లు, పి.పార్థసారధి రెండుసార్లు, టిఎన్వీ రెడ్డి ఒకసారి రాజంపేటలో, మరోసారి చిత్తూరులో గెలిచారు. సిఎల్ఎన్ రెడ్డి, ఎస్.పాలకొండ్రాయుడు, గునిపాటి రామయ్యలు ఒక్కోసారి గెలిచారు. సాయిప్రతాప్ , పార్థసారధిలు కేంద్రంలో మంత్రులుగా పని చేశారు. 

Activities are not Found
No results found.