రాయచోటి - రాయచోటి

రాయచోటి
రాయచోటి

2014 సాధారణ ఎన్నికలలో రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుంచి వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి మూడో సారి విజయం సాధించారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ధి ఆర్.రమేష్ కుమార్ రెడ్డిపై 34782 ఓట్ల మెజార్టీతో గెలిచారు. శ్రీకాంతరెడ్డి 2009లో కాంగ్రెస్ తరపున గెలిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో వైసిపిలోకి వచ్చారు. 2012 జరిగిన ఉప ఎన్నికలలో 55వేల మెజార్టీతో గెలిచారు. ఈసారి 34 వేలకుపైగా ఆధిక్యతతో మూడోసారి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అహ్మద్ కు 2061 ఓట్లు వచ్చాయి. శ్రీకాంతరెడ్డి, రమేష్ కుమార్ రెడ్డిలు రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే. రమేష్ రెడ్డి గతంలో టిడిపి తరపున లక్కిరెడ్డిపల్లి(రద్దైంది) నుంచి గెలుపొందారు. ఆ తర్వాత కొంతకాలం కాంగ్రెస్ లోకి వెళ్లి తిరిగి టిడిపిలోకి వచ్చి పోటీ చేశారు. రమేష్ రెడ్డి తండ్రి రాజగోపాలరెడ్డి ఐదుసార్లు గెలుపొందారు. ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. శ్రీకాంతరెడ్డి తండ్రి గడికొట మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా గతంలో ఎన్నికయ్యారు.  రాయచోటిలో నాలుగుసార్లు గెలిచిన పాలకొండ్రాయుడు, ఒకసారి లోక్ సభకు కూడా గెలిచారు. 
రాయచోటికి 16సార్లు ఎన్నికలు జరగితే.. కాంగ్రెస్,కాంగ్రెస్ ఐలు కలిసి 8సార్లు, టిడిపి రెండుసార్లు, వైసిపి రెండుసార్లు గెలిచాయి. స్వతంత్ర, జనతా, కెఎంపిపిలు ఒక్కొక్కసారి గెలిచాయి. ఇండిపెండెంటు ఒకరు గెలిచారు. స్వాతంత్రయోధుడు వై.ఆదినారాయణరెడ్డి రెండుసార్లు, ఎం.నాగిరెడ్డి రెండుసార్లు, ఎం.నారాయణరెడ్డి రెండుసార్లు గెలుపొందారు.  నాగిరెడ్డి, నారాయణరెడ్డి ఒకే కుటుంబానికి చెందినవారు. ఆదినారాయణరెడ్డి రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు.

Activities are not Found
No results found.