నరసన్నపేట - నరసన్నపేట

నరసన్నపేట
నరసన్నపేట

నరసన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి వైసిపి లో చేరి అనర్హత వేటు  జరిగిన ఉప ఎన్నికలో గెలిచినా 2014 సాధారణ ఎన్నికలో ఓటమి చెందడం విశేషం. వైసిపికి ప్రధాన నాయకుడిగా ఉన్న ఆయన స్వయంగా టిడిపి అభ్యర్ధి బగ్గు రమణమూర్తిపై 4800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతుకుముందు ఉప ఎన్నికలో 7312 ఆధిక్యతతో గెలుపొందారు కృష్ణదాస్ . నరసన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్ధి డోల జగన్మోహన్ కు కేవలం 2158 ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్ కోల్పోయారు. 
నరసన్నపేటకు మొత్తం 14సార్లు ఎన్నికలు జరిగితే .. కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐలు కలిసి ఏడుసార్లు, టిడిపి నాలుగుసార్లు, స్వతంత్ర పార్టీ రెండుసార్లు, కెఎల్పీ ఒకసారి గెలిచాయి. 
మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు రెండుసార్లు ఇక్కడ గెలిస్తే , మరోరెండుసార్లు శ్రీకాకుళంలో గెలుపొందారు. నిమ్మ జగన్నాథం మూడుసార్లు గెలిచారు. ఆయన కుమారుడు ప్రభాకరరావు ఇక్కడ నుంచి గతంలో రెండుసార్లు చట్టసభకు ఎన్నికయ్యారు. బగ్గు సరోజనమ్మ, ఒకసారి గెలిచిన లక్ష్మణరావు తల్లికొడుకులు, రమణమూర్తి కూడా వీరి కుటుంబానికి చెందినవారే. 

Activities are not Found
No results found.
By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close
Telegram Connect With Telegram