గుడూరు - గుడూరు

గుడూరు
గుడూరు

2014 సాధారణ ఎన్నికలలో గూడూరు రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్ధి పి.సునీల్ కుమార్ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి డాక్టర్ బి.రాధా జ్యోత్స్నలతను ఓడించారు. ఇక టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే బల్లి దుర్గా ప్రసాదరావుకు టికెట్ ఇవ్వకపోవడంతో తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీ చేశారు. కేవలం 368 ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పనబాక కృష్ణయ్య కూడా 9637 ఓట్లు మాత్రమే తెచ్చుకోవడంతో డిపాజిట్ గల్లంతైంది. 
గూడూరుకు 14సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఆరుసార్లు, టిడిపి ఐదుసార్లు గెలిచాయి. వైసిపి ఒకసారి, ఇండిపెండెంట్లు ఇద్దరు గెలిచారు. పెల్లేటి గోపాలకృష్ణారెడ్డి, ఎం.మునుస్వామి రెండేసి సార్లు, పట్ర ప్రకాశరావు మూడుసార్లు, బల్లి దుర్గా ప్రసాదరావు నాలుగుసార్లు గెలిచారు.  దుర్గా ప్రసాదరావు గతంలో చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా పని చేశారు. గూడూరులో ఇండిపెండెంటుగా నెగ్గిన నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆ తరువాత మరో నాలుగుసార్లు వెంకటగిరి, కోవూరులలో గెలిచారు. 

Activities are not Found
No results found.