సర్వేపల్లి - సర్వేపల్లి

సర్వేపల్లి
సర్వేపల్లి

2014 సాధారణ ఎన్నికలలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్ధి కాకాణి గోవర్ధన్ రెడ్డి విజయం సాధించారు.  ఆయన తన సమీప ప్రత్యర్ధి, టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై 5446 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కె.పట్టాభిరామయ్యకు 1366 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాకాణి గోవర్ధన్ రెడ్డి గతంలో కాంగ్రెస్ లో ఉండి , ఆ పార్టీలో జరిగిన పరిణామాల కారణంగా వైసిపిలో చేరారు.  2014లో ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక రెండుసార్లు సర్వేపల్లిలో గెలిచిన సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా మూడోసారి ఓడిపోయారు. సోమిరెడ్డి 2012లో కోవూరులో జరిగిన ఉప ఎన్నికలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మరో నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి 2014లో కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరి , నెల్లూరు ఎంపి పదవికి పోటీ చేసి ఓడిపోయారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి సర్వేపల్లిలో రెండుసార్లు గెలవగా , అల్లూరులో ఒకసారి గెలిచారు. అల్లూరులో టిడిపి తరపున పోటీ చేసి గెలిచిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలుపొందారు. చంద్రబాబు క్యాబినెట్ లో కూడా కొంతకాలం ఆదాల పని చేశారు. ఇక సర్వేపల్లిలో రెండుసార్లు గెలిచిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా చంద్రబాబు క్యాబినెట్ లో పని చేశారు.  ఈయన మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డికి మేనల్లుడు అవుతారు. 
సర్వేపల్లికి 14సార్లు ఎన్నికలు జరిగితే ..కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ కలిసి ఏడుసార్లు , టిడిపి నాలుగుసార్లు, వైసిపి ఒకసారి , సిపిఐ ఒకసారి గెలిచాయి. ఇండిపెండెంటు ఒకరు గెలుపొందారు. 

Activities are not Found
No results found.