సూళ్లురుపేట - సూళ్లురుపేట

సూళ్లురుపేట
సూళ్లురుపేట

2014 సాధారణ ఎన్నికలలో సూళ్లూరుపేట శాసనసభ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్ధి కె.సంజీవయ్య గెలుపొందారు.  ఆయన టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే పరసా రత్నం ను 3780 ఓట్ల మెజార్టీతో ఓడించారు. ఇక కాంగ్రెస్ తరపున పోటీ చేసిన డి.మధుసూదనరావుకు కేవలం 2793 ఓట్లు మాత్రమే వచ్చాయి. 
సూళ్లూరుపేటకు 12 సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఐదుసార్లు, టిడిపి ఐదుసార్లు గెలిచాయి. వైసిపి ఒకసారి, ఇండిపెండెంటు ఒకరు గెలిచారు. ఈ నియోజకవర్గంలో పిట్ల వెంకటసుబ్బయ్య మూడుసార్లు, పరసా వెంకటరత్నం మూడుసార్లు గెలిచారు. పరసా వెంకటరత్నం గతంలో చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా పని చేశారు. ఇక్కడ ఒకసారి గెలిచిన పెంచలయ్య గతంలో నేదురుమల్లి క్యాబినెట్ లో మంత్రిగా పని చేశారు. ఈయన తిరుపతి నుంచి లోక్ సభ కు కూడా ఎన్నికయ్యారు. 2004లో సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా గెలిచిన నెలవల సుబ్రహ్మణ్యం గతంలో తిరుపతి ఎంపిగా కూడా ఒకసారి ఎన్నికయ్యారు. 

Activities are not Found
No results found.
By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close
Telegram Connect With Telegram