సత్యవేడు - సత్యవేడు

సత్యవేడు
సత్యవేడు

2014 సాధారణ ఎన్నికలలో సత్యవేడు శాసనసభ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్ధి తలారి ఆదిత్య విజయం సాధించారు. ఆయన తన సమీప వైసిపి అభ్యర్ధి కె.ఆదిమూలంపై 4227 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆదిత్య గతంలో టిడిపి తరపున ఒకసారి ఎమ్మెల్యే అయిన తలారి మనోహర్ కుమారుడు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పి.చంద్రశేఖర్ కు 2451 ఓట్లు వచ్చాయి. సిట్టింగ్ టిడిపి ఎమ్మెల్యే హేమలతకు 2014లో పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. 
సత్యవేడు నియోజకవర్గానికి 12సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ లు కలిసి ఐదుసార్లు, టిడిపి ఆరుసార్లు, స్వతంత్ర పార్టీ ఒకసారి గెలిచాయి. పిసిసి అధ్యక్షుడుగా, మంత్రిగా పని చేసిన సి.దాస్ మూడుసార్లు ఇక్కడ నుంచి గెలుపొందారు. ఈయన రెండుసార్లు లోక్ సభకు కూడా ఎన్నికయ్యారు. ఎం.సురాజన్ రెండుసార్లు గెలిచారు. ఒక్కడ ఒకసారి గెలిచిన డాక్టర్ ఎన్.శివప్రసాద్ , చిత్తూరు లోక్ సభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. ఈయన చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి కూడా పని చేశారు. సత్యవేడులో ఒకసారి గెలిచిన బాలకృష్ణయ్య తిరుపతి ఎంపిగా కూడా విజయం సాధించారు. 

Activities are not Found
No results found.