శ్రీకాళహస్తి - శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి

2014 సాధారణ ఎన్నికలలో శ్రీకాళహస్తి శాసనసభ నియోజకవర్గం నుంచి టిడిపి సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరోసారి గెలుపొందారు. ఆయన తన సమీప వైసిపి ప్రత్యర్ధి బి.మధుసూదనరెడ్డిపై 7583 ఓట్ల మెజార్టీతో ఐదోసారి విజయం సాధించారు. అనంతరం చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా కొద్దికాలం పని చేశారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎస్.బిత్తయ్య నాయుడుకు 2963 ఓట్లు మాత్రమే వచ్చాయి. బొజ్జల 1989లో తొలిసారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఒక్క 2004లోనే ఓడిపోయారు. 
శ్రీకాళహస్తి నియోజకవర్గానికి 17సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి ఎనిమిదిసార్లు, టిడిపి ఏడుసార్లు గెలిచాయి. ఇండిపెండెంట్లు రెండుసార్లు గెలుపొందారు. 
1955లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి నీలం సంజీవరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడే ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. 1952లో అనంతపురం నుంచి పోటీ చేసి తన సమీప బంధువు తరిమెల నాగిరెడ్డి చేతిలో ఓడిపోయారు.  ఆ తర్వాత ఆయన కోసం శ్రీకాళహస్తిలో గెలుపొందిన బలరామిరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.  ఆ తర్వాత 1953, తిరిగి 1955లో సంజీవరెడ్డి గెలిచారు. 
శ్రీకాళహస్తిలో అడ్డూరి బలరామిరెడ్డి మూడుసార్లు గెలిస్తే, ఆయన కుమారుడు థశరథరామిరెడ్డి మరో రెండుసార్లు గెలుపొందారు. బలరామిరెడ్డి మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా కూడా పని చేశారు.  ఐదుసార్లు ఇక్కడ గెలిచిన గోపాలకృష్ణారెడ్డికి ఒక్కడ ఒకసారి గెలిచిన గంగసుబ్బరామిరెడ్డి తండ్రి,  మరో సీనియర్ నేత పెద్దిరెడ్డి తిమ్మారెడ్డికి అల్లుడు. 

Activities are not Found
No results found.