తిరుపతి - తిరుపతి

తిరుపతి
తిరుపతి

2014 సాధారణ ఎన్నికలలో తిరుపతి లోక్ సభ ఎస్సీ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్ధి వెలగపల్లి వరప్రసాద్ విజయం సాధించారు. ఆయన తన సమీప బిజెపి-టిడిపి కూటమి అభ్యర్ధి కారుమంచి జయరామ్ పై 37425 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వరప్రసాద్ కు 580376 ఓట్లు రాగా, జయరామ్ కు 542951 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన చింతా మోహన్ కు 33333 ఓట్లు రావడంతో డిపాజిట్ కోల్పోయారు. ఇక్కడ నుంచి ఆరుసార్లు ఎంపిగా ఉంటూ తిరిగి పోటీ చేసిన మోహన్ కు తెలంగాణ ఏర్పాటు నేపధ్యంలో ఘోర పరాజయం పాలయ్యారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసిపికి ఆరుచోట్ల, బిజెపికి ఒకచోట అధిక్యత లభించింది. వైసిపికి సర్వేపల్లిలో 23242, గూడూరులో 19967, సూళ్లూరుపేటలో 14862, వెంకటగిరిలో 2857, శ్రీకాళహస్తిలో 1243, సత్యవేడులో 7064 ఓట్ల మెజార్టీ వచ్చింది. బిజెపికి తిరుపతిలో 30833 ఓట్ల అధిక్యత లభించింది. 
తిరుపతి లోక్ సభ కు మొత్తం 15సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ లు కలిసి 12సార్లు, టిడిపి ఒకసారి, బిజెపి ఒకసారి, వైసిపి ఒకసారి గెలిచాయి. తిరుపతి జనరల్ సీటుగా ఉన్నప్పుడు అనంతశయనం అయ్యంగార్ ఒకసారి గెలిచారు. ఆయన చిత్తూరులో రెండుసార్లు గెలుపొందారు. సి.దాస్, టి.బాలకృష్ణయ్య రెండేసిసార్లు గెలిచారు. పసల పెంచయ్య ఒకసారి, చింతా మోహన్ ఆరుసార్లు, ఎన్.సుబ్రహ్మణ్యం ఒకసారి, డాక్టర్ వెంకటస్వామి, వరప్రసాద్ ఒక్కోసారి గెలుపొందారు. అయ్యంగార్ లోక్ సభ కు తొలి స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించారు. చింతా మోహన్ కేంద్రమంత్రిగా పని చేశారు. 

Activities are not Found
No results found.
By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close
Telegram Connect With Telegram