వెంకటగిరి - వెంకటగిరి

వెంకటగిరి
వెంకటగిరి

2014 సాధారణ ఎన్నికలలో వెంకటగిరి నియోజకవర్గం నుంచి టిడిపి నేత కురుగంటి రామకృష్ణ మరోసారి విజయం సాధించారు. ఆయన  తన సమీప వైసిపి ప్రత్యర్ధి కొమ్మి లక్ష్మయ్యనాయుడుపై 5635 ఓట్ల మెజార్టీతో గెలిచారు. టిడిపి నేత రామకృష్ణ 2009లో మాజీ  మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మిని ఓడించారు. రాజ్యలక్ష్మి వరుసగా రెండుసార్లు ఇక్కడ నుంచి గెలవగా, జనార్ధన్ రెడ్డి ఒకసారి గెలిచారు. నేదురుమల్లి రాజ్యసభకు ఎన్నికైన కొంతకాలానికి దివంగతులయ్యారు. ఆయన బాపట్ల, నరసరావుపేట, విశాఖ నుంచి లోక్ సభ కు , ఒకసారి శాసనమండలికి ఎన్నికై నాలుగు చట్టసభలకు ఎన్నికైన అతికొద్దిమందిలో ఒకరుగా నమోదయ్యారు. వెంకటగిరిలో 2014లో నేదురుమల్లి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసినా 5375 ఓట్లు పొంది డిపాజిట్ కోల్పోయారు. వెంకటగిరిలో నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాసులురెడ్డి సోదరులు ఒక్కొక్కసారి గెలుపొందారు. వెంకటగిరి నుంచయి పి.వెంకటస్వామిరెడ్డి, అల్లం కృష్ణయ్య, ఓ.వెంకటసుబ్బయ్య, నేదురుమల్లి రాజ్యలక్ష్మి లు రెండేసిసార్లు విజయం సాధించారు. అల్లం కృష్ణయ్య ఒకసారి ఏకగ్రీవంగా గెలిచారు. ఇక్కడ ఒక్కొక్కసారి గెలిచిన వివిఆర్కే యాచేంద్ర, సాయికృష్ణ యాచేంద్రలు తండ్రి,కొడుకులు. రాజ్యలక్ష్మి 2004లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా పని చేశారు. 
వెంకటగిరికి 15సార్లు ఎన్నికలు జరిగితే .. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి 9సార్లు, టిడిపి ఐదుసార్లు గెలిచాయి. ఇండిపెండెంటు ఒకరు గెలుపొందారు.  

Activities are not Found
No results found.