భద్రాచలం - భద్రాచలం

భద్రాచలం
భద్రాచలం

భద్రాచలం (ఎస్టీ) నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,33,756. అందులో పురుషులు -   64,993,  మహిళలు - 68,745, థర్డ్ జెండర్ - 18 మంది ఉన్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలకు తమ అభ్యర్ధిగా తెల్లం వెంకట్రావును రంగంలోకి దింపింది టిఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ నుంచి పోడెం వీరయ్య  పోటీ  చేస్తున్నారు. బిజెపి నుంచి కుంజా సత్యవతి , బిఎల్ఎఫ్ నుంచి సిపిఎం అభ్యర్ధి మిడియం బాబురావు ఎన్నికల బరిలో దిగారు. 

నాలుగు దశాబ్దాలుగా సిపిఎంకు కంచుకోటగా ఉన్న భద్రాచలంలో మూడోసారి సున్నం రాజయ్య గెలుపొందారు. 2009లో ఆయన ఓటమి చెందినా, తిరిగి 20014  సాధారణ ఎన్నికల్లో తన సమీప టిడిపి ప్రత్యర్ధి ఫణీశ్వరమ్మను 1815 ఓట్ల తేడాతో ఓడించారు. రాజయ్య అంతకుముందు రెండుసార్లు గెలిచారు. 2014లో తెలంగాణలో సిపిఎం పక్షాన గెలిచిన ఏకైక నేత కూడా ఈయనే. 2009లో మిర్యాలగూడలో సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి ఒక్కరే గెలిచారు. ఈసారి ఆయన కూడా ఓడిపోయారు. భద్రాచలంలో మాత్రమే సిపిఎం గెలుపొందింది.కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా కుంజా సత్యవతి మరోసారి పోటీ చేసి 22061 ఓట్లు తెచ్చుకుని పరాజయం చెందారు. టిఆర్ఎస్ తరపున పోటీ చేసిన ఎం.రామకృష్ణకు 8728 ఓట్లు వచ్చాయి. భద్రాచలం 1952, 55 ఎన్నికల వరకు ఆంధ్ర ప్రాంతం తూర్పుగోదావరి జిల్లాల్లో ఉండగా, ఆ తర్వాత ఖమ్మం జిల్లాలోకి వెళ్లింది. 
భద్రాచలానికి 15సార్లు ఎన్నికలు జరిగితే 52,55లలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. 1952లో కేఎంపిపి గెలిస్తే, 1955లో సిపిఐ గెలిచింది. అయితే గెలిచినవారిలో సీతారామయ్య ఎన్నిక చెల్లదని కోర్టు చెప్పడంతో జరిగిన ఉప ఎన్నికలో పివి.రావు గెలిచారు. ఈ ఉపఎన్నికతోపాటు మొత్తం నాలుగుసార్లు కాంగ్రెస్ గెలిచింది. సిపిఎం 8 సార్లు గెలిచింది. ఇక్కడ టిడిపి ఒక్కసారి కూడా గెలవలేదు. సిపిఎం నేతలు కుంజా బొజ్జి మూడుసార్లు, ముర్ల ఎర్రయ్యరెడ్డి రెండుసార్లు, సున్నం రాజయ్య రెండుసార్లు గెలిచారు.  

   

 

ఈసారి ఎమ్మెల్యే అభ్యర్ధిగా తెల్లం వెంకట్రావును రంగంలోకి దింపింది టిఆర్ఎస్. 

 

 

Activities are not Found
No results found.
By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close
Telegram Connect With Telegram